Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/467

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రకరణం 16

తెలుగుభాషాచరిత్ర : సింహావలోకనం

- భద్రిరాజు క్భష్ణమూర్తి

16.0 అవతారిక : ద్రావిడభాషా కుటుంబాన్ని మూడు ఉపకుటుంబాలుగా విభజించవచ్చు.1 దక్షిణ, మధ్య, ఉత్తర ద్రావిడభాషలని. దక్షిణ ద్రావిడ ఉప కుటుంబం మరి రెండు శాఖలుగా చీలింది : (1) తమిళం, మలయాళం, కన్నడం, కొడగు, తొద, కోత; (2) తెలుగు, కూయి, కువి, కూబి (= కొండ), గోండి, పెంగొ, మండ, పర్జీ, కోలామ్‌, నాయకి, ఒల్లారి, గదబ మధ్య ద్రావిడ భాషలు. కురుఖ్‌ (= కూఁడుఖ్), మాల్తో, బ్రాహూయీ ఉత్తర ద్రావిడ భాషలు. తెలుగు తనకు దక్షిణ పశ్చిమాలనున్న తమిళ కన్నడాదులకంటె, పూర్వోత్తరాలనున్న కూయి మొదలైన వాటికే పుట్టుకలో సన్నిహితమని శాస్త్రజ్ఞులంతా ఒప్పుకొన్న సత్యం. కాని తెలుగు-కూయి శాఖ మధ్య ద్రావిడ ఉపకుటుంబానికి చెందిందా, దక్షిణ ద్రావిడకుటుంబానికి చెందిందా అన్న విషయంమాత్రం ఇంకా వివాదగ్రస్తంగా ఉంది. ఇది దక్షిణ భాషోపకుటుంవానికి చెందింది అనటానికే ఆధారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి: ఉదా.2

(1) "ఇ" > "ఎ"/ # (హ) - హ + అ

   "ఉ" > "ఒ"/   

ప్రాచీన ద్రావిడంలో ధాతుగతమైన ఇ,ఉ వర్ణాలు, పరాక్షరంలో అత్వంఉన్నప్పుడు క్రమంగా ఎ, ఒ వర్ణాలవుతాయి. (§ 2.12). ఈ సూత్రం దక్షిణ ద్రావిడ ఉప కుటుంబానికంతటికీ వర్తిస్తుంది. అంటే ఇది తమిళ-కన్నడశాఖ, తెలుగు-కూయి శాఖ ఏకశాఖగా ఉన్నకాలంలో జరిగిన మార్పై ఉండాలి. ద్రావిడ మాతృకలో 'ఉప్పు' అనే అర్ధంలో *చువ్‌ : *చువర్‌ అనే రూపాలుండేవి. సూత్రం 1 వల్ల

1. ఈ అధ్యాయంలో కుండలీకరణాల్లో § గుర్తుతో ఇచ్చిన అంకెలు ఈ గ్రంథంలో వచ్చిన ప్రకరణాలకు, విభాగాలకు చెందినవిగా గుర్తించాలి.

2. A > B/-C. 'C' అనేది పరంగాతన్నప్పుడు 'A', 'B' గా మారుతుంది. ఈ విధంగా సూత్రాలను చదువుకోవాలి. ఇవి చారిత్రక పరిణామాన్ని సూచిస్తాయి.