ఈ పుటను అచ్చుదిద్దలేదు
అర్థపరిణామం 451
ఐదువ (రాలు) శబ్దరత్నాకరకర్త ఈ పదానికి ఐదువన్నెలు గలది (సుమంగళి) అని వ్యుత్పత్తిని చెప్పి వన్నె అనగా సుమంగళియొక్క అలంకారమని వివరించి ఆ ఐదువన్నెలు 1. మంగళసూత్రము, 2. పసుపు, 3. కుంకుమము, 4. గాజులు, 5. చెవ్వాకు అని పేర్కొన్నాడు. నిఘంటువులో ఉన్న ఈ అర్థం లోకనిరుక్తికి సంబంధించిందే. సుమంగళివాచియైన 'అవిధవా' అనే సంస్కృత పదానికి తద్భవమైన 'ఐదువ' లేక 'అయిదవ' తెలుగులో అదే అర్థంలో ప్రయోగించబడింది. ఐదు అనే సంఖ్యావాచకానికి ఐదువ పదానికి ఎలాంటి సంబంధంలేదు.
అర్ధతత్వరంగంలో ఇటీవల ప్రచారానికి వస్తున్న సిద్ధాంతాలను విధానాలను తెలుగుభాష కన్వయించి పరిశీలించ వలసిన అవసరం ఏంతైనా ఉంది.