454 తెలుగు భాషా చరిత్ర
ద. ద్రా. శాఖల్లో ప్రథమైకవచన రూపం నాన్-/నేన్- (< *ఞాన్) కనిపిస్తుంది. మధ్యోత్తర భాషల్లో దీని సోదర రూపాలులేవు. అందువల్ల ద. ద్రా. శాఖలు రెండూ కలిసి ఉన్న కాలంలో ఇది కల్పించబడి ఉంటుంది. ప్రాచీన మాతృకలో *యాన్ (= తెలుగు ఏను) నుంచి ఏర్పడ్డ రూపాలు అన్ని ద్రావిడ భాషలలోనూ ఉన్నాయి (వివరాలకు, చూ. కృష్ణమూర్తి 1968 a).
16.1. ప్రాచీన ద్రావిడ మాతృకలో 16 హల్లులు, 10 అచ్చులు ఉండేవి.
హల్లులు : ప త ట ట చ క మ న ణ ఞ ల ళ ర ఱ వ య
అచ్చులు : ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఒఓ అఆ
ప్రా. ద్రా. లో పదాదిన దంతమూలీయ మూర్ధన్యాలు లేవు. అంటే ప త చ క మ న ఞ వ య - లే పదాదినవచ్చే హల్లులు. పదాలు అచ్చుతోగాని, హల్లుతో గాని మొదలయ్యేవి. ధాతువులన్నీ ఏకాచ్కాలుగానే ఉండేవి : (హల్లు) + అచ్చు, (హల్లు1) + అచ్చు + హల్లు2, అచ్చు హ్రస్వ దీర్ఘాల్లో ఏదైనా కావచ్చు; హల్లు1 పైన ఉదాహరించిన తొమ్మిదికే పరిమితం; హల్లు2 పదహారు హల్లుల్లో ఏదైనా కావచ్చు. ధాతువు ననుసరించి వచ్చే అచ్చులు ఆ ఇ ఉ లుగానే ఉండేవి. ఇవి ప్రత్యయ (derivative or farmative) భాగాలు. అచ్చుల మధ్య/క చ ట ట త ప/లకు[గ స డ ఱ ద వ] అనే ఉచ్చారణ ఉండేది. ట దంతమూలీయం, ట మూర్ధన్యం. అనునాసికం తరవాత స్పర్శాలన్నీ నాదవంతాలయ్యేవి [గ జ డ డ ద బ] అని వర్ణరచనలో /పకల్/ /పొజ్కు! ఉచ్చారణలో (పగల్], [పొజ్గు] అని భావించాలి. ఈ రకమైన రాత ఇంకా తమిళంలో నిలిచిఉంది.
16.2. ప్రాక్తెలుగు : తెలుగు చారిత్రక స్థితికి రాకముందు పై నిరూపించినవి గాక మరికొన్ని ధ్వనుల మార్పులు జరిగాయి.