448 తెలుగు భాషా చరిత్ర
చీర : మొదట ఈ పదానికి స్త్రీపురుషులందరూ ధరించే వస్త్రమని అర్థం. తిక్కన కాలంలో ఈపదానికున్న అర్థమిదే “...జనపాలక నందనుండు జయ లక్షింజే, కొననటె చీరలు దెచ్చుట, పనియే..." (విరాట. 4-48). ఈ నాడీ పదానికి స్త్రీలు ధరించే వస్త్రమని అర్థపరిమితి ఏర్పడింది. ఇట్టిదే కోక అనేపదం కూడా. శ్రీనాథుని కాలంలో ఈపదానికి సామాన్యమైన వస్త్రమనే అర్థం. “కుళ్ళాయుంచితి కోకఁజుట్టితి” అని శ్రీనాథుని చాటువు.
పెద్ద : నన్నయ ప్రయోగాల్లో పెద్ద అనేమాటకు వివిధార్థచ్చాయలున్నాయి (చూ. పుటలు 432.83). ఈనాడీపదం జ్యేష్టారాన్ని, పరిణామాధిక్యాన్ని మాత్రమే సూచించడానికి పరిమితమైంది.
ఆరాధ్యుడు : పూజనీయుడని ఈపదానికిగల సామాన్యార్థం. శైవుల్లో ఒక తెగను మాత్రమే సూచించే పరిమితార్థం తెలుగులో దీనీకి ఏర్పడింది.
సాహెబు (< అర. సాహెబ్) చెలికాడు, సహచరుడని ఈపదానికి మౌలికార్థం. మహమ్మదీయుడని దీని కేర్పడ్డ అర్ధ పరిమితి.
వస్తాదు (< పర్షి. ఉస్తాద్ ) ఉపాధ్యాయుడు. అని దీనికి మౌలికార్థం. అర్థసంకోచంవల్ల ఈ పదానికి కుస్తీలపట్టే విద్యనునేర్పే ఉపాధ్యాయుడని, తరువాత కుస్తీలుపట్టేవాడు లేక మల్లుడనే అర్థం పరిణమించింది.
పత్రం : పర్ణం, ఆకు అని మొదట దీనీకుండిన విసృతార్థం. అర్థ సంకోచం వల్ల తాటియాకు, కాగితం అనే అర్థాలు కూడా దీనికి ఏర్పడ్డాయి. ఈనాటి వ్యవహారంలో బుణపత్రమనే దీని అర్థపరిమితి.
15. 12. అర్థగౌరవం : (Elevation of meaning or amelioration) : ఒక కాలంలో నిందార్థంలో లేదా సామాన్యార్థంలో వాడబడే పదాలు విశిష్టార్థ బోధకాలైనప్పుడు ఆ పదాలకు అర్థగౌరవం ఏర్పడిందని గుర్తి౦చడం పరిపాటి. దీన్నే అర్ధోత్కర్ష అనికూడా అంటారు; ఉదా.
సభికులు : జూదగాండ్రని ఈ పదానికున్న మౌలికార్థం. తర్వాత రాజుగారి కొలువులోనివారు, సభలోని ప్రేక్షకులనే విశేషారం దీనికి కల్గింది.
ముహూర్తం : నిమేషకాలం, అల్పకాలమని దీని అర్థం. శుభకార్యాలకు నిర్ణీతమైన పవిత్రకాలం అని దీనికేర్పడిన అర్థగౌరవం.