అర్థపరిణామం 447
ణామవిధానాలు గుర్తించవచ్చునుకాని అర్ధపరిణాము హేతువుల్ని మాత్రం నిర్ణయించలేము. ఈశతాబ్దాదిలో Breal అనే ఫ్రెంచిభాషా శాస్త్రజ్ఞుడు(Breal,1900) భాషల్లోజరిగే అర్థపరిణామాన్ని కొన్ని రకాలుగా వర్గీకరించాడు. అతడు ప్రతిపాదించిన వర్గీకరణ విధానాన్ని ఆధారంగా జేసుకొని తెలుగుభాషా చరిత్రలో జరిగిన అర్థపరిణామాన్ని ఈ కింద స్థూలంగా పరిశీలిస్తాను.
15.10. అర్ధవ్యాకోచం (Extension of meaning or generation of meaning) : ఒక దశలో పరిమితార్థబోధకమైన ఒక పదం అర్థవిస్తృతిని పొంది జాతివాచకమైనప్పుడు ఆపదంలో కలిగిన పరిణామం అర్థవ్యాకోచం
చెంబు : శోణార్థకమైన చెమ్ < కెమ్ ఈపదంలోని మూలధాతువు. ఈపదానికి అర్ధం ఎర్రని వస్తువుతో అనగా రాగి లోహంతో చేయబడిన చిన్నపాత్ర అని. అర్థవ్యాకోచం వల్ల అట్టి ఉపయోగం, ఆకారం కల్గిన ఏ లోహంతో చేసిన పాత్రకైనా తర్వాత చెంబు అనేమాట ప్రచారంలోకి వచ్చింది : వెండిచెంబు, ఇత్తడి చెంబు మొ.
అష్టకష్టాలు : ఎనిమిది రకాలైన కష్టాలు: 1. దేశాంతరగమనం, 2. భార్యావియోగం, 3. ఆపత్కాలబంధుదర్శనం, 4. ఉచ్చిష్టబోజనం, 5. శత్రుస్నేహం, 6. పరాన్నప్రతీక్షణం, 7. అప్రతిష్ట, 8. దారిద్ర్యం. వ్యవహారంలో అష్టకష్టాలన్నప్పుడు సంఖ్యాపరిమితిలేని అనేకకష్టాలని సామాన్యార్థం.
అవధాని : అవధానం చేసేవ్యక్తిని అవధాని అనడం అసలు అర్థం. కాని ఈనాడు అట్టి పరిమితార్థంలోగాక ఈపదం వ్యక్తుల పేర్లలో కులసూచకార్థ విస్తృతిని పొందింది. ఇటువంటిదే సోమయాజి, ఉపద్రష్టవంటి పదాల్లోను ఏర్పడిన అర్ధవ్యాకోచం.
మహారాజు : రాజులకు రాజని దీని అర్థం, వ్యవహారంలో ధనవంతుడని అర్థ విస్తృతి ఏర్పడింది. మహారాజరాజశ్రీ అని ఉత్తరాల్లో కొందరు పేర్లకు పెట్టే విశేషణం.
15.11 అర్థసంకోచం (Restriction of meaning or specialisation): విస్తృతార్థమున్న ఒక పదానికి పరిమితార్థ మేర్పడినప్పుడు జరిగిన పరిణామానికి అర్ధసంకోచమని పేరు; ఉదా.