Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/456

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అర్థపరిణామం 441

జ్యంబును నొప్పుకొని...”. (సభా. 2-264). సమ్మతించు అంగీకరించు అని మాత్రమే ఈ పదానికి నేటి వ్యవహారంలో కన్పించే అర్థం.

కంపు : వాసన, సువాసన అనే అర్దాల్లోనే దీన్ని నన్నయ వాడినాడు. “... కందియును మహాసుగంధ కుసుమ తతులు దొంటియట్ల తమకంపు విడువక యుండు...”. అర్థపరిణామం వల్ల నేడీ పదానికి దుర్గంధం, చెడువాసన అని అర్థం ఏర్పడింది.

కాఁపులు : కాపురమున్నవారు అనే అర్థంలో నన్నయ ప్రయోగం, “...ఇందుల కాఁపుల నందఱఁదొల్లి యిల్వరుసన మ్రి౦గుచు..." (ఆది, 6-267) ఈ పదం నేడు వ్యవసాయ వృత్తిలోని వారిలో ఒక కులాన్ని తెల్పుతుంది.

కొప్పు : నన్నయలో ఈపదానికి జుట్టుముడి, వేనలి, కొన అనే అర్థా లున్నాయి, "...నేలబఁడిన వానిఁ గొప్పువట్టి యీడ్చికొని వచ్చె. ధర్మజు కడకు...” (ఆది. 7-45) “...పడియున్న పాములందన వింటి కొప్పుననెత్తి” (ఆది - 2-168). స్త్రీల శిరోజబంధ విశేషమే కొప్పు అని నేడు రూఢిలోకి వచ్చిన అరం.

తగవు : తగినది, యుక్తం, న్యాయం, న్యాయమైనది అనే అర్ధాల్లో నన్నయ ప్రయోగాలు. “...మనమునఁ దగవూహింపక నన్నుఁ బలుకుటుచితమె నీకున్‌” (అరణ్య, 1-364), "...అమరలోకంబు వేశ్యలమైన మాకు నిట్టి తగవులు నడవవు ...” (అరణ్య 1-362), కారణకార్య సంబంధాన్ని బట్టి ఈ పదానికి జగడము. తగాదా అనే అర్థం నన్నయ తర్వాత పరిణమించింది.

పెద్ద : ఈ పదానికి నన్నయ ప్రయోగాల్లో వివిధార్థచ్భాయలు కన్పిస్తున్నాయి, 1. ఎక్కువ, “శ్రీమహాభారతంబు నందలి యభిప్రాయంబు విననభిలాష పెద్ధదై యుండు” (ఆది. 1-11) 2. చాల: మిక్కిలి : ".... కడుం బెద్దదవ్వు పోయిన యట్లు" (ఆది 1-117); 3. ఎక్కువ: (కాలమునకు సంబంధించి) “... పెద్దకాలంబు రాజ్యసుఖంబు లనుభవించి..." (ఆది 4-109); 4. శ్రేష్టం : “...ధర్ముంబుల కె౦దుఁ బెద్ద యందు సత్యంబు” (ఆది. 4-96); 5. అధిపతి ; ...ఇంద్రుఁడు. పెద్ద సర్వలోకములకు,...” (ఆది. 5-120); 6. గొప్ప: “మీదయ మాకుఁ గల్గగ సమిత్రుల నోర్చుట యేమి పెద్ద...” (అరణ్య, 3-170); "కపినాథ : నికిది యేమి పెద్ద". (అరణ్య. 3-353);