పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/455

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

440 తెలుగు భాషా చరిత్ర

ముహూర్తం (< సం, ముహుర్తమ్‌ 1. నిమేషకాలము, లిప్త. 2. అల్ప కాలము, 3. నలుబది ఎనిమిది నిమిషముల కాలము) వివాహాది కార్యాలకు నిర్ణయించబడిన శుభసమయం అని దీనికి తెలుగులో అర్థం.

వాచకం (< సం. వాచకమ్‌ వాచ్యార్ధమును తెల్పెడి శబ్ధము) తెలుగులో దీనికి భాషను బోధించే పిల్లల పాఠ్యపుస్తకం అని అర్ధం. అద్యేతలు స్వయంగా చదువుకొనడానికి నిర్ణీతమైనది ఉపవాచకం.

విపరీతం (< సం. విపరీతః వ్యత్యస్తము, అపక్రమము) నేటి తెలుగులో ఎక్కువ, ఆధిక్యం అని వాడుక.

15.7. నన్నయ భారతం మనకు లభ్యమైన తొలి తెలుగు కావ్యం. నన్నయ ప్రయోగించిన తత్సమ దేశ్యపదాలలో కొన్నిటికి తర్వాతి కాలంలో అర్ధ పరిణామం కన్పిస్తుంది. ఉదాహరణకు:

అవ్వ : నన్నయలో ఈపదానికి స్త్రీ అని సామాన్యార్థం. "... అంతి పురంబున నున్న ముదుసలి యవ్వలెల్లిం బఱతెంచి ..." (సభా. 1.150) స్త్రీ సంబోధనా వాచకంగా కూడ దీనికి నన్నయలో ప్రయోగం ఉంది. “అవ్వా నీవెవ్వరి కూఁతురవు...” (అరణ్య 3-184) నేటీ వ్యవహారంలో ఈ పదం కేవలం వృద్ధనారీవాచి. రాయలసీమ మాండలికంలో మాతామహికి 'అవ్వ' పితామహికి 'జేజి' అని కొందరి వ్యవహారం.

ఎఱుక : నన్నయతో ఙ్ఞానం ని దీనికర్థం "ఏయది హృద్య మపూర్వ౦, బేయది యెద్దాని వినిన నెఱుక సమగ్రంబై యుండు”. (ఆది 1.30); “ ...ఎఱుక గలరె మగువలెందు" (ఆది. 2-34). ఈ పదానికి పరిచయం కలిగి ఉండటం అని మాత్రమే నేటి వ్యవహారం. ఎరుక చెప్పు = సోదెచెప్పు, వ్యక్తి భవిష్యత్తును గురించి చెప్పు.

ఒప్పుకొను : ఈపదానికి 'తీసుకొను' అనే అర్థంలోనే నన్నయ ప్రయోగం “ ...ఒప్పుకొనుము వీని నుర్వీశ యని సుతునిచ్చి గంగసనిన..." (ఆది 4-169) “... ఇక్కుమారుండు మేరుగిరి శృంగంబునుం బోలె నాకెత్తికొన నశక్యుండయ్యె వీని నొప్పుకొనుమనిన.." (సభా. 1 - 152); “సర్వసంపదలు స్వరా