442 తెలుగు భాషా చరిత్ర
7. పెరుగు (క్రి) : “ అపత్యంబు పెద్దయగుటం జూచి” (ఆది. 8-300); నన్నయ కాలంలో స్థలకాలాదులకు విశేషణంగా ఉన్న ఈపదం నేటి వ్యవహార౦లో జ్యేష్టార్థాన్ని పరిమాణాధిక్యాన్నీ తెలుపుతుంది. (పెద్దకొడుకు, పెద్దరాయి). పెద్ద మనిషి అనే పదబంధానికి న్యాయాన్యాయ వీవేచన గలవాడని.
బూతు : ఈమాటకు నన్నయలో పొగడే వాడు అనే అర్థం. "....బూతు వొగడినట్లు వొగడెదు..” (సభా. 2-48); దీని కీనాడు ఆశ్లీల వచనం అని అర్థం.
రేపు: ఉదయం ప్రొద్దున అని నన్నయ ప్రయోగాల్లో దీని అర్థం. “మరునాడు రేపకడయ కద్రువయు, వినతయుం జని...” (ఆది. 2-37); “వల్కలంబులు గట్టి రేపును మధ్యాహ్నంబు నప్పుడును...” (ఆది. 5-61); అర్థపరిణామంలో ఈ పదానికి ప్రొద్దున అనే అర్థంపోయి మరునాడనే అర్థం ఏర్పడింది.
జీవీతం : “నరే౦ద్రోత్తమ ! భృత్యకోటికి సమాసముగాఁదగు జీవితంబు లాయత్తము సేసి యిత్తె" (సభా. 1=37). నన్నయలో 'జీతం' అనే అర్థంలో ప్రయోగింపబడిన జీవిత శబ్ధానికి ఆ అర్థమీనాడు లేదు.
దూషించు : ఈ తత్సమక్రియకు నన్నయలో పరిహరించు, విసర్జించు అనే ప్రయోగాలున్నాయి. "ఒక్కని కారణంబునఁ గులంబున కెగ్గగునేని. వాని దూషించి కులంబు రక్షి౦చుట ధర్మంబని శుక్రుండు జెప్పె..." (సభా.2-179). ఈనాడు దీనికి నిందించు తిట్టు అని వాడుకలోని అర్థం.
బాస : భాషా శచ్దానికి తద్భవమైన ఈ పదాన్ని నన్నయ విధం, వైఖరి, తీరు అనే అర్థంలో వాడినాడు. “వీని బాస చూడ వేఱంచు” (ఆది. 6-295); “పలికిన బాసఁజూడ నత్యుత్తమ క్షత్రియాన్వయు లగుదురు" (ఆది. 7-228). ఈ పదానికి ప్రమాణమని తర్వాత ఏర్పడిన అర్థ పరిణామం. నన్నయ భారతంలో అర్ధపరిణామ దృష్ట్యా ఆసక్తిని కలిగించే పదప్రయోగాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ కొన్ని మాత్రమే ఉదహరించ బడినాయి.
15. 8. ఆంధ్రదేశంలో మహమ్మదీయుల పరిపాలన కారణంగా క్రీ. శ. 13 వ శతాబ్దా౦తంనుండి హిందూస్తానీ పదాలు అరబిక్ (అర.) పర్షియన్ (పర్షి.) ఉర్దూ భాషలకు సంబంధించినవి) తెలుగువారి వ్యవహరంలోకి, కావ్యరచనల్లోకి