Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/454

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అర్థపరిణామం 439

చ. “దప్పిగొన్నమ, ర్యునకు మనోహరాంబువులు గ్రోలక మంచున దాహమాఱునే” (జైమినీ భారతం 9-272) .

పరిశోధన (<సం. పరిశోధనమ్‌ శోధించుట) ఈ పదానికీనాడు విద్యా రంగంలో నూతన విషయాన్వేషణ అనే అర్థముంది.

పరిశ్రమ (< సం. పరిశ్రమ అలవాటు, మిక్కిలి అలపు). ఈ పదానికి వస్తూత్పత్తి యంత్రాగారం (industry) అనే అర్థం వాడుకలోకి వచ్చింది. (భారీపర్మికమలు, కుటీర పరిశ్రమలు).

పూజ్యం (< సం: పూజ్యః పూజనీయము, గౌరవింపదగిన) తెలుగులో శూన్యం, సున్న, ఖాళీ అనే అర్థాలు.

ప్రమాద౦ (< సం. ప్రమాదః 1. అనవధానత, ఏమఱుపాటు, 2. మత్తు) ఈ పదానికి రూఢిలో ప్రాణాపాయసంఘటన అనే అర్థం పరిణమించింది. (అగ్ని ప్రమాదం, రైలు ప్రమాదం).

ప్రియం (<సం. ప్రియమ్‌ ప్రేమ, ప్రీతి; స్నేహము, సంతోషము). హెచ్చువెలగలది అనే అర్థం కేవలం తెలుగు వ్యవహారానికి సంబంధించింది.

భద్రం ( < సం. భద్రమ్‌ శుభము, శుభకార్య యోగ్యమైనది, శుభకార్యము, శ్రేష్టము) దీనికి జాగ్రత్త అని తెలుగులో పరిణమించిన అర్థం.

మర్య్రాద (<సం. మర్యాదా 1. పొలిమేర, 2. సముద్రతీరము, ఒడ్డు, 3. హద్దు, 4. పద్ధతి, ఆచారము) తెలుగులో ఈ పదానికి గౌరవం, పూజ్యభావం, సత్ప్రవర్తన అనే అర్దాలు ఏర్పడినాయి.

ముష్టి (< సం. ముష్టిః పిడికిలి; పిడికెడు) ఈ పదానికి బిచ్చం అనే అర్థం తెలుగులో సంభవించిన పరిణామం.

"సీ, మిన్నంత సంపదఁజెన్నారి యుండియు

ముష్టికి లోనయ్యె ముదిత నడుము...."

(చంద్రాంగద చరిత్ర 2-42)

ముష్టివాడు. 'ముష్టికి మూడునంచులా' అని తెలుగు సామెత.