పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/453

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

438 తెలుగు భాషా చరిత్ర

సము, పాటుపడట) పని, జీవనోపాధికి నిర్వహించే కార్యం అనే అర్థంలోనే ఈనాడు ఈ పదానికి ఎక్కువ వ్యాప్తి (ఉద్యోగులు, ఉద్యోగ్యప్రయత్నం, నిరుద్యోగ సమస్య).

ఉచితం (< సం. ఉచితమ్‌ 1 తగినది, యుక్తము 2, అలవాటుపడినది, పరిచితము, 3. మితము) సంస్కృతంలోని అర్థాలతోపాటు ఈ పదానికి తెలుగులో డబ్బు చెల్లించనక్కరలేని అనే అర్థం కూడా. ఉంది. (ఈ పుస్తకాలు నాకు ఉచితంగా ఇచ్చారు).

కాల్యాణం (< సం, కల్యాణమ్‌ 1 అక్షయము, నాశము లేనిది. ౭. శుభయుక్తము, 3. ఉత్సవము, పండుగ) తెలుగులో వివాహం, పెండ్లి అనే అర్ధ పరిణామం కన్పిస్తుంది. శాఖ॥ “.... రుక్మిణీ, కల్యాణంబు వినంగ నాకు మదిలో కౌతూహలం బయ్యెడిన్‌” (భాగ. 10పూ. 1682) (కల్యాణోత్సవం, కల్యాణమండప౦).

గతి (<సం. గతి 1, గమనం, పోక, 2. నడక, 3. త్రోవ, 4. ఉపాయము, 5. ఎఱుక, 6. స్థానము, 7. పరిణామము) ఈ పదానికి తెలుగుతో అమూలకమైన శరణం, దిక్కు, వలె, విధం, రీతి అనే అర్థాలు పరిణమించి ఉన్నాయి, (ఎదీ గతినాకు రంగా;)

గీ॥ “...వీర లేమిగతి బల్కిన నడియెల్ల మనముఁ గైకొనవలయుగాక (భార. విరాట. 5.275)

గ్రహచారం (<సం. గ్రహచారః గ్రహముల గమనము) తెలుగులో దీనికి దురదృష్టం అనే అర్థమే కన్పిస్తుంది. 'గాచ్చారం' అని రాయలసీమ మాండలికంలో.(గ్రహచారపదం సూర్యరాయాంధ్ర నిఘ౦టువులో మృగ్యం.)

ఘటం (< సం. ఘటః 1. కుండ, 2. ఏనుగు కుంభన్ధలము, క. కుంభకము, 4, శిఖరము) ఈ పదానికి తెలుగు వ్యవహారంబో శరీరానికి, వ్యక్తికి నిందార్థంలో వ్యాప్తి కన్ఫిస్తుంది (ఆ ఘటం ఇంకా చావలేదు).

దాహం (< సం. చాహమ్‌ మంట, జ్వాల, కాలుట) మౌలికార్థంలో నన్నయ ప్రయోగం”... .లక్కయింట నగ్ని దాహంబు' , నెట్లు బ్రదికిరొక్కౌ...." [ఆది. 7-195), దప్పిక, పానీయమనే అర్దాలు ఈ పదానికి తెలుగులో ఏర్పడిన పరిణామం, (దాహం తీసుకోండి).