పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28 తెలుగు భాషా చరిత్ర

       తె. తాత : త. తాత్తా. క. తాత, తు, తాతె (2580).
       తె. సుతై : త. మ. చుత్తి, క. సుత్తిగె, తు. సుత్తి (2197).               
                                                                       
 2.18. (i) తె. ప- < *ప-
       తె. పని : త, మ. కొ. పణి (3209).
       తె. పాడు :త,  మం పాటు, క. పొడు, కో, ప. పాడ్-, గోం.             
           పార్- (3348).
       తె. పేరు : త. మ. పెయర్‌, పేర్ల్, క. పెసర్‌, కో, నా. పేర్‌,              
           ప. పిదిర్‌ (3612).
                                                                                                            
  (ii) తె. -ప-/-ప్ప-<* -ప్ప-
       తె. చెప్పు (నా.) : త. చెరుప్పు, మ. చెరిప్పు, క. కెర్సు, కో.             
           నా. కెర్రి, గోం. సెర్పూం (1698).
       తె. తోపు తమ, తోప్పు, క. తు, తోపు (20290).
       తె. త్రిప్పు : త. కిరుప్పు మ. తిరిప్పు, క. తిరుపు (2655),
       తె. వేంప (చెట్టు) : త. వేప్ప (4551).                              
                                                                       
 2.19. తెలుగులో నాదస్పర్శాలైన గ,జ,డ,ద,బ లు కూడా పదాదిని ఉంటాయి. తమిళం, మలయాళం తప్ప మిగిలిన అన్ని ద్రావిడ భాషల్లోనూ కూడా ఇవి పదాదిని ఉన్నా ఇవి మూల ద్రావిడభాషలో ఉండేని కావని పండితుల అభ్మిప్రాయం. తమిళ మలయాళాల్లో ఇవి లేకపోవడం వల్లా, ఇవి ఉండే భాషల్లో కూడా ఒక పదంలో కొన్ని భాషల్లో నాదస్సర్శముంటే - మరికొన్నిటిలో శ్వాసస్పర్శం ఉండి, దీనికేమీ నియమం లేకపోవడం వల్లా మూల ద్రావిడంలో శ్వాసస్పర్శాలు కొన్ని కొన్ని భాషల్లో కొన్ని పదాల్లో తరవాత కాలంలో నాదాలుగా మారడం వల్ల ఇవి ఏర్పడ్డాయని కాల్డ్‌ వెల్‌ చేసిన సిద్ధాంతాన్ని బరో (Dravidian studies I 1963 : 1-17) సోపపత్తికంగా నిరూపించారు. అద్విరుక్తంగా ఉండే స్పర్మాలు అచ్చుల మధ్య, అనునానికం తరవాత అన్ని (ద్రావిడ భాషల్లోనూ నాదాలుగానే ఉంటాయి. కాని శ్వాసాలుగా ఉండవు. (తెలుగులో ఈ స్థానాల్లో ఉండే శ్వాస స్పర్శాల మొదట్లో ద్విరుక్తాలని గమనించాలి). కాబట్టి అచ్చుల మధ్యా, అనునాసికం తరవాతా వచ్చే అద్విరుక్తస్పర్శాలు మూల భాషల్లోనే నాదాలుగా మారి