ఈ పుట అచ్చుదిద్దబడ్డది
27. తెలుగు : మిగిలిన ద్రావిడభాషలు
2.16. (i) పదాది టకారం తెలుగులో టెంకాయ (త. తేంకాయ్ 2306)- టేకు (త. మ. తేక్కు, 2842), టెక్కియము మొదలైన చాలా కొద్ది మాటల్లోనే ఉంది. పై మాటల్లో మొదటి రెండింటిలోనూ ఈ టకారం, తకారం నించి వచ్చినట్లు స్పష్టం.
(ii) తె. -ట-/-ట్ట- <* ట్ట తె. ఆట : త. మ. అట్టం, క. ఆట, ఆటు (290). తె. తిట్టు : త. క. తిట్టు (2632). తె. పాట : త. మ. పొట్టు, క. పాట (3348). (iii) -ట-/-ట్ట- <* -ఱ్ఱ- తె. చాటు (క్రియ) : త. మ. చాఱ్ఱు, క. సాఱు (2052). తె. చుట్టము : త. మ. చుఱ్ఱo (2233). తె. పుట్ట : త,మ. పుఱ్ఱు, క. పుత్తు, పుత్త, గోం. పత్తీ, కొం. పుఱ్హి, కు. పుత్తా, మా. పుతె (3556). తె. మాట : త. మ. మాఱ్ఱo, క. మాతు, మాత (3960). 2.17. (i) తె. త- <* త- తె. తప్పు : త. మ. క. తప్పు (2498). తె. తల : త. తలై, మ. తల, క. తలె, తల, కూ. త్లఉ (2529). తె. తిను : త. మ. క. తు. గోం, కూ, కో. ప. తిన్ (2670). తె. తేనె : త. మ. తేన్, క. తేను, కో. నా. తేనె (2574). తెలుగు త్రాడు (త. మ. చరటు 1947), త్రాచు (త. అర, ఆరా, కూ. ప్రాసు, (1949), దురద (త. మ. చొఱి, క. తుఱి, (2343) మొదలైన కొద్దిమాటల్లో మూలద్రావిడం లో పదాది చకారం తెలుగులో త/దలుగా మారుతుంది. (బరో 1968 : 167). (ii) తె. -త-/-త్త-< * త్త- తె. అత్త : త. అత్తై, క. ఆతై, అత్తి, గోం. అతీ (121).