Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/427

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

412 తెలుగు భాషాచరిత్ర

యంగా, వర్గరూపంగా కొద్ది పరధిలో కూడా తమతమ దృష్టితో నిరూపించవచ్చు. కాని ప్రమాణ - అప్రమాణభేదం రాష్ట్రం మొత్తానికీ, భాష అంతటికీ సంబ౦ధించిన విలువ. ప్రతి ప్రా౦తంలోని శిష్ణవ్యవహారమంతా ప్రమాణంకాదు, కాని ప్రమాణ భాషలో చేరినది ఏమండలంలోనూ అశిష్ట వ్యవహారమై ఉండదు. అనుకరణ ఏముఖంగా జరుగుతున్నదన్న దాన్ని బట్టి ఏది ప్రమాణమో ఏది అప్రమాణమో గుర్తిస్తాము; ఉదా. శిష్టుల్లోనే 'అట్లా' ప్రయోగం తగ్గి 'అలా' ప్రయోగం పెరుగు తున్నది.

(c) ఒక లక్షణమే కొన్ని మాటల్లో శిష్టవ్యవహార ధర్మం కావచ్చు, మరి కొన్ని మాటల్లో శీష్టేతర ధర్మం కావచ్చు. వకారలోపం 'వెళ్ళాడు', 'వేశాడు' శబ్దాల్లో శిష్టుల్లోనూ ఉంది. ఉదా : వాడెళ్ళాడు, వాడు నన్ను 'పడేశాడు'. కాని ఇతర శబ్దాల్లో వస్తే శిష్టేతర భాషాలక్షణ మౌతుంది ; ఉదా. వాడు యేడికి (= వేడికి) తట్టుకోలేడు అలాగే. 'కురవదు', 'కలవదు' శిష్టం, శిష్టేతరం కూడా. కానీ తెలవదు శిష్టేతరుల వాడుకే.

(d) సాంఘిక చరిత్ర కారణంగా తద్భవాలకు, దేశ్యశబ్దాలకు పరపతి తగ్గి, అన్యదేశ్యాలకు, తత్సమాలకు విలువ (శిష్టవ్యవహార యోగ్యత) పెరుగుతుంది 'కూడు, బువ్వ, కత, పొద్దు, మంగలి. చాకలి, గొల్ల' మొ. మాటలకు ఈనాడు విలువ తక్కువ. వాటి బదులు 'అన్నం, కథ, రోజు, క్షురక, రజక, యాదవ' శబ్దాలకు విలువ ఎక్కువయింది.

(e) మాండలిక భేదాలున్న పదాలు మాత్రం సందర్భాన్నిబట్టి ప్రమాణ భాషలో చేరవచ్చు. సొరకాయ-ఆనపకాయ, భోగట్టా-సంగతి, చెక్క-వక్క, ఇలాటివన్నీ ప్రమాణభాషలో చేరాయి. ఉత్తమరచనల ద్వారా మాండలికపదాలు ప్రమాణభాషలో చేరతాయి.

(f) శిష్టశిష్టేతరభేదం - రెండువర్గాల వాడుకలో ఉన్న ఉచ్చారణలు, వ్యాకరణ కార్యాలు, పదాలను ఆశ్రయించి ఉంటుంది. ఒకరి వాడుకలోనే ఉన్న వాటిలో ఈభేదం కనిపించదు. వృత్తిపదాలు చాలా వరకు దేశ్యాలు; ఆయా వృత్తుల నాశ్రయించి బతికే జానపదుల వ్యవహారంలోనే ఉంటాయి. ఆ పదాల్లో శిష్టశిష్టేతరభేదం నిరూపించటం సాధ్యంకాదు. నాగలి, గొర్రు, గుంటక, మేడి గొడ్డలి - ఇలాటి మాటల్లో ఈతేడా కనిపించదు. అలానే కలెక్టరాఫీసు గుమాస్తా