తెలుగుమాండలికాలు : ప్రమాణభాష 411
అంటే చదువుకొన్నవాళ్ళు తమ ప్రాంతపు పలుకుబళ్ళను రచనలోకి ఎక్కిస్తారు. కాని అట్టి భేదాలు గ్రామీణవ్యవహారంతో పోల్చుకుంటే చాలా తక్కువ; అర్దావగాహనకు అడ్డు వచ్చేవికావు. ఉదా. అలా అట్లా, అట్టా- మూడూ శిష్ట రచనల్లో కనిపిస్తాయి; భూతార్థక ప్రత్యయంలో శిష్ణులరచనలో తేడాలున్నాయి. ఉదా. వచ్చాడు/వచ్చినాడు. తెలంగాణాలో శిష్ణులు 'వచ్చిండు' అని అంటున్నా, సభల్లోను, రచనల్లోను 'వచ్చినాడు' అనే అంటారు. విధ్యర్థంలో 'చెప్పున్రి, చేయున్రి' స్థానంలో ఇప్పుడు 'చెప్పండి, చేయండి' అనే వాడుకలు వస్తున్నాయి. వ్యతిరేకవిధిలో చెప్పకు/చెప్పవాకు! చెప్పబాకు/, చెప్పాకు/చెప్పాక మొ.వి. నిర్ధారణలో చెప్పాలి/చెప్పాలె/చెప్పాల మొ.వి. చదువుకున్నవారే వేరువేరు ప్రాంతాల్లో అంటారు. అయినా 'చెప్పకు, చెప్పాలి' వంటి రూపాలకు ఎక్కువగా లిఖితవాఙ్మయంలో చెలామణీ ఏర్పడుతున్నది. కోస్తా జిల్లాల్లో శిష్టులు 'వస్తూ. పోతూ' అనీ, శిష్టేతరులు వస్తా, పోతా, అనీ అంటారు. రాయలసీమలో శిష్టులు కూడా 'వస్తా,పోతా' రూపాలు వాడుతారు. అన్నమాచార్యుల కీర్తనల భాషలోనూ శత్రర్థ ప్రత్యయంగా- 'తా' కనిపిస్తుంది. అయినా అప్పుడు రాయలసీమ రచయితలు 'తూ' రూపాలనే రాతల్లో వాడుతున్నారు. పైవిధంగా శిష్టుల వాడుకలో ఉన్న బహురూపత క్రమంగా తగ్గి లఖిత ప్రమాణ భాషలో ఏకరూపత ఏర్పడుతుంది. ఈ పక్రియ పూర్తి కావటానికి కొన్ని దశాబ్ధులు పట్టవచ్చు.
14.14. శిష్టభాష, ప్రమాణభాష:
(a) ఒకకాలంలో శిష్టభాషాలక్షణమనిపించుకొన్నది మరోకాలంలో అశిష్టం కావచ్చు. నన్నయభాషలోను, సమకాలీన శాసనాల్లోనూ గసడదవాదేశ సంధి కనిపిస్తుంది. ఉదా. 'వాడుసెప్పె' మొ. ఇప్పుడు 'వాడు సెప్పాడు' అని 'చ', 'స' గా మారిస్తే పామరజన వ్యవహార మనిపిస్తుంది, 'తెచ్చుతాడు' మొ.వి. కేతన గ్రామ్యాలన్నాడు. అదే (>తెస్తాడు) ఇప్పుడు శిష్ణరూపమైంది.
(b) ఓక ప్రాంతంలో శిష్ణవ్యవహారం మరొక ప్రాంతంలో శిష్టేతరం కావచ్చు. రాయలసీమలో శిష్టవ్యవవారంలో 'వస్తా', 'పోతా' మొ. శతర్ధకరూపొలు కోస్తా జిల్లాల వాడుకలో 'తక్కువరకం' వాడుకగా పరిగణించ బడతాయి. “వచ్చినాడు” మొ. రాయలసీమ శిష్టరూపాలు కళింగ మండలంలో గ్రామీణ వ్యవ హారంలో వినిపిస్తాయి. పై కారణాలవల్ల శిష్హం - ఆశిష్టం అనే వేదాన్ని ప్రా౦తీ,