Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/428

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తెలుగుమాండలికాలు ; ప్రమాణభాష 413

తన పనిలో వాడే మాటలకు శిష్టేతరుల్లో తుల్య శబ్దాలుండవు కాబట్టి అవి గూడా వర్గమాండలికాలకు లక్ష్యంకావు. బహురూపత (రూపాంతరత్వం) ఉన్నచోటనే ప్రమాణీకరణానికి ఆవశ్యకత ఏర్పడుతుంది.

14.15. ప్రమాణభాషకు ఆవశ్యకత ఏమిటీ అన్న ప్రశ్న మిగిలిపోయింది. ప్రమాణభాషకు ఈ కిందిలక్షణాలు, ప్రయోజనాలు ఉంటాయి. (1) ప్రమాణభాష ఎక్కువమంది ప్రజలకు సమ్మతంగా ఉంటుంది. (2) విద్యాబోధన ప్రమాణభాషలో జరుగుతుంది. ప్రమాణభాష నేర్చుకోటమే విద్యావంతుడనిపింనుకోటానికి లక్షణ మవుతుంది. (3) మాండలికాలకంటే ప్రమాణభాషా ప్రయోగానికి వ్యాప్తి ఏక్కువ. ఉపన్యాసాలు, వచనలరచనలు, వార్తాపత్రికలు, సినిమాలు; రేడియో. టెలివిజన్‌, మొదలైన విజ్ఞాన వ్యాపకసాధనలన్నీ ప్రమాణభాషనే వాడుతాయి. (4) ప్రమాణభాష వ్యవహర్తల సాంస్కృతిక వైజ్ఞానిక ఐకమత్యానికి ఒక సంకేత మవుతుంది. ప్రాంతీయవర్గ మాండలికాలు వాళ్ళ వేర్పాటుకు గుర్తులవుతాయి. (5) ప్రమాణభాష ప్రాథమికంగా ఏదో ఒక ప్రాంతంలో చదువుకొన్న వాళ్ళ వాడుక ఆధారంగా ఏర్పడి మాండలిక ప్రయోగాలను కలుపుకొంటూ వ్యాష్తమవుతుంది. (6) కొన్ని భాషల్లో ప్రాచీన కావ్యభాషే ప్రమాణభాషగా వ్యవహర్తలు గుర్తిసారు. అప్పుడు మాండలికాల ప్రభావం ప్రమాణభాషపై అట్టేపడదు. ఉదా. అరబిక్‌, తమిళం. కాని వ్యవహారానికి దూరమయ్యేకొద్దీ ఈ పరిస్థితి క్రమంగా మారి ఏదో ఒక మండలంలో ఉన్న శిష్టభాషే ప్రాచీన ప్రమాణభాషను తోసివేసి వస్తుంది. ఈ మార్పుకు కొన్ని శతాబ్దులు పట్టవచ్చు.

జానపదులు విద్యావంతులైన కొద్దీ నాగరకులు ప్రమాణభాషను మరింత క్లిష్టంచేసి తమ వ్యక్తిత్వాన్ని, దూరాన్ని నిలుపుకోటానికి ప్రయత్నిస్తారు. ఈనాడు అధిక సంస్కృతీ కృతమైన హిందీ 'ఖడీబోలీ' కంటె దూరమై పోవటం దీనికి లక్ష్యం. వర్ణమాన భాషల్లో ప్రమాణభాషను మాండలిక సమ్మేళనంతో సులభ గ్రాహ్యం చెయ్యటం అవసరం.

ఙ్ఞాపికలు

1. ముఖస్తుతితో ఆశ్రయించే వ్యక్తి 'చెమ్చా' : ఆకర్షణీయంగా ముస్తాబు కావట౦ 'లైటుగొట్టట౦'.

2. పూర్వద్రావిడ ఞాన్‌' శబ్దంనుంచి తెలుగులో నేను/నా-రూపలేర్పడాయి.