పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/417

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

402 తెలుగు భాషా చరిత్ర

14.4. ప్రాంతీయ భేదాలనే గుర్తి౦చదలుచుకొన్నప్పుడు ఏదో ఒకవర్గానికి చెందిన వారి వాడుకనుంచె ఉద్దేశించిన వివరాలు సేకరించాలి. ఇలా సేకరించిన వాడుకకు ఒక్కొక్కదానికి ఓక సంకేతం పెట్టుకొని తెలుగుదేశ పటంలో గుర్తించ వచ్చు. వాడుక మారినచోట సంకేతం మారుతుంది. ఈ విధంగా - తయారుచేసిన పటాలను మాండలికపటాలంటారు. పదాలు ప్రధానంగా గీచిన పటాలను 'word atlas' అని, ధ్వనులు ప్రధానంగా గీచిన పటాలను 'phonetic atlas' అని, వ్యాకరణ విశేషాలు లక్ష్యంగా గీచిన పటాలను 'grammatical atlas' అని వ్యవహరించవచ్చు. ఇంతవరకు తెలుగులో జరిగిన మాండలిక పరిశీలన ప్రధానంగా పదాలవాడుక లక్ష్యంగా చేసింది. అది కూడా భాషామండలాలు నిరూపించే ఉద్దేశంతో. చేసిందికాదు; వృత్తుల్లో ఉన్న పదాలను కోశస్థంచేసే దృష్టితో చేసింది. అందువల్ల పై మాండలిక నిర్ణయం స్థూలదృష్టితో చేసింది మాత్రమే.

పైవిధంగా గీచిన పటాలను వాడుక మారినచోట గుర్తులు మారుతుంటాయి. అలాంటి గుర్తులన్నీ ఒకవైపుకు వచ్చేటట్లు వేరుచేసి పటంలో గీచినగీతను వ్యవహార భేదరేఖ (isogloss) అంటారు. ఇలాంటి వ్యవహారభేదక రేఖలు చాలా పటాల్లో కలిసి నియత ప్రాంతాలను వేరుచేస్తున్నప్పుడు వాటన్నింటినీ బొత్తిగా మరోపటంలో గీయవచ్చు. బొత్తిగా ఏర్పడ్డ వ్యవహారభేదక రేఖలే భాషామండలాలకు సరిహద్దు లుగా గుర్తించాలి. అంటే ఒక మండలం వాడుక ఇక్కడ సన్నగిల్లి అక్కుణ్నించి మరోమండలం వాడుక మొదలవుతుంది. పై నిరూపించిన విధానం ఈ అధ్యాయం చివర ఇచ్చిన మచ్చు షటాల్లో చూడవచ్చు (పేజీలు 414-426).

14.5. మాండలికపద పటాలనుబట్టి ప్రతిపదానికి ఉన్న పుట్టు పూర్వోత్త రాలను గ్రహించవచ్చు. ప్రజలు ఏయే దిక్కుగా వలసపోయింది ఊహించవచ్చు. భాషకు సాంఘిక రాజకీయచరిత్రకు సమన్వయం పదపటాల్లో గోచరిస్తుంది. ఒక కొత్త మాట ఏదో ఒక కేంద్రంలో పుట్టి చుట్టుపక్కల ఎంతదూరం వ్యాపించిందీ తెలుసుకోవచ్చు. ఉదా. పయ్యె(= చెక్రం), తుకం (= నారు) అనేమాటలు అన్య దేశ్యాలు; ఉర్దూ తుఖమ్‌, తుఖ్మ్‌ = 'గింజ, జీవాణువు'; పహియా = 'చక్ర౦' నుంచి వాడుకలో కలిసినవి. వీటి వ్యాప్తి హైదరాబాద్‌ కే౦ద్ర౦గా చుట్టుపక్కల జిల్లాలకు పరిమితంగా ఉంది. (చూ. మాం. పృ. కో. 1.77,91). ఇతర