పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/418

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తెలుగుమాండలికాలు : ప్రమాణభాష 403

తెలంగాణా ప్రా౦తంలో 'గీర'/'గిర్ర'/'గిల్ల' ( = చెక్ర౦), 'నారు' పదాలే వ్యాప్తిలో ఉన్నాయి. ఈవిధంగా కొత్తమాటలకు పాదైన కేంద్రాన్ని 'focal area' అంటారు. అవి ప్రసరించిన మేర అంతకు ముందున్న పాతమాటల వాడుక మాసిపోతుంది. ఈ రకమైన మార్పులకు లోబడకుండా ఉన్న దూరస్థలాలో కొన్ని పాతమాటల వాడుక నిలిచిపోవచ్చు. అలాంటి ప్రా౦తాన్ని పురాతనవ్యవహారప్రా౦తం (relic area) గా గుర్తి౦చవచ్చు: ఆదిలాబాదుజిల్లా ఉత్తరపు కొసన 'నారు' కు 'నేరు' అనేవాడుక ఉంది. (చూ. మా౦. వృ. కో. 1.91). పూర్వద్రావిడంలో ఉన్న *ఞాఱు, శబ్దం నుంచి తెలుగులో నిష్పన్నమైనది నారు/నేరు. అని ఉండ వచ్చు. 'నా'/'నే'ల మార్పు 'ఞా' మాతృకకు సూచన2. ఈప్రా౦తంలోనే 'కాడికి' పూర్వరూపం 'కాణ్ణి' కూడా వాడుకలో ఉంది. దీని అర్వాచీనరూపాలు కాణి/కాని మిగలిన తెలంగాణాలో ఉన్నాయి. రెండు భాషామండలాల మధ్య వ్యవహార భేదక రేఖలు కిందుమీదుగా పోతున్నట్లు ఈ అధ్యాయం చివరి పటాల్లో చూడవచ్చు. ఇలాంటి ప్రా౦తాన్ని మాండలికసంధిప్రా౦తం (transition zone) గా గుర్తించ వచ్చు. అంటే రెండు మండలాలలో విలక్షణంగా ఉన్నమాటలు అన్ని ఈ ప్రాంత ప్రజల వాడుకలో వినిపిస్తాయి. ఖమ్మంజిల్లా తూర్పు ప్రా౦తంలో గాలు/రోజా/ గిర్రచక్ర౦) మూడు ప్రా౦తాలకు విలక్షణమైన వాడుకలున్నాయి (చూ. పటం 4). పది ఇరవై ఏళ్ళ కొకసారి మళ్ళి పదసేకరణచేసి పటాలుగీచి అంతకుముందు గీచినవాటితో పోల్చి చూస్తే వ్యవహార భేదకరేఖలు మరోతీరున గుర్తి౦చవలసి రావచ్చు. దీన్ని బట్టి ఒక పదంవ్యాప్తి ఏదిక్కున పోతున్నదో దానికిెగల సాంఘీక రాజకీయ హేతువులేమిటో గ్రహించవచ్చు. పైన చూపిన 'పయ్యె', 'తుకం' మాటలబదులు మళ్ళి దేశ్యశబ్దాలు వ్యాపించి వీటివ్యాప్తి సంకుచితం కావచ్చు. ఉర్దూ పాఠ్యభాషగాగాక తెలుగుకు ప్రాధాన్యం పెరుగుతు న్నదికాబట్టీ ఈ ఊహ సమంజసమని తోస్తుంది. కాని పునఃపరిశీలనవల్లగాని ఈ సంగతి తేలదు.

14. 6. మాండలిక పదపరిశోధనవల్ల ప్రాచీనకవి రచిత గ్రంథాల్లో వచ్చిన మాటలకు స్పష్టార్ద నిరూపణ సాధ్యమౌతుంది. నిశితంగా పరిశీలించి నప్పుడు కొందరు కవులు, వాడిన మాండలిక పదాలు ఆధారంగా వారేప్రా౦తం వారో ఊహించవచ్చు. 'గునపం', 'గడ్డపాఱ' శబ్దాలు పింగళిసూరన -కళాపూర్ణో దయంలో కనిపిస్తున్నాయి. (కళా, 6:8; 6 : 23). ఈమాటలకు అంతకుపూర్వ