తెలుగుమాండలీకాలు : ప్రమాణభాష 401
ప్రభావంవల్ల హైదరాబాదు చుట్టుపట్ల కొన్ని తెలుగు మాటల బదులు ఉర్దూమాటలు వచ్చినా, తెలంగాణా ప్రాంతానికే విలక్షణమైన దేశ్యశబ్దాలుకూడా ఎన్నో ఉన్నాయి. ఉదా. దుబ్బనేల (= సన్నటి ఇసకనేల), కాణి/కాని (= కాడి), గారె/గిర్ర (= చెక్రం; హైదరాబాడు చుట్టుపట్ల పయ్యె < ఉర్దూ పహియా), పుండికూర/ పుంటికూర (= గోంగూర), పె౦డ (= పేడ), చిట్టె (= చిలప), మొ. వి. రాజకీయమైన అస్తిమితత్వమే కృష్ణాగోదావరీ మధ్యదేశ౦ ప్రత్యేక భాషామండలంగా కనిపించక పోవటానికి కారణం. అంటే ప్రతిమాట వాడుకలోనూ మిగిలిన మూడు మండలాల్లో ఏదో ఒకదానితో కలవటమే మధ్యా౦ధ్ర మండల వ్యవహారంలోని విలక్షణత. దీన్ని మిశ్ర వ్యవహారమండలం అనవచ్చు. (చూ. భద్రిరాజు కృష్ణ మూర్తి 1962 : 50-3).
14.3. మాండలిక పరిశీలన విధానం :
మాండలిక పరిశీలన ప్రయోజనదృష్టినిబట్టి ఎన్నో రకాల జరగవచ్చు. (1) ఏదో ఒక 'అర్థం' తీసుకొని ఆ అర్థంలో ప్రతిచోట ఏమాట వాడుతారో ఊరూరూ తిరిగి సేకరించవచ్చు. లేదా 20, 30 మైళ్ళు దూరంలో ఉన్న ఊళ్ళు తిరిగి సేకరించవచ్చు. 'పొలం దున్నే పనిముట్టు' కు 'నాగలి, నాగేలు, నాగెల నాంగలి, మడక' అనే మాటలు వాడుకలో ఉన్నట్లు తెలిసింది. ఈ మాటల్లో 'మడక' తప్ప మిగిలినవన్నీ అన్యోన్యం రూపాంతరాలు, అంటే చారిత్రకంగా ఒకే ప్రాచీన శబ్దం నుంచి ఏర్పడ్డవి. (<* నాజ్గేల్); 'మడక' వీటికి పర్యాయ పదం. (2) దేశం అంతటా ఒకే శబ్దం ఉచ్చారణ భేదాలతో మాత్రమే ఉంటుం దని తెలిసిన కొన్ని మాటలు తీసుకొని ఆయా భేదాలను ధ్వని విధేయ లిపిలో సేకరించటం. 'రేగడి. రేగడ, రేగిడి, రేవడి, రేవడ, రాగడి, రాగిడి' మొ. వి. రే/రా, గ/వ, డ/డి. భేదాలు ఏ ప్రా౦తల్లో వస్తున్నాయి అనే సూక్ష్మ పరిశీలన దీనివల్ల సాధ్యమవుతున్నది. అలాగే లేక/లేదు శబ్దాల్లో మొదటిపదంలో 'లే, వివృతం (అకారం పరమైనప్పుడు) రెండో పదంలో సంవృతం (అకారేతరాచ్చు పరమైనప్పుడు). దేశం అంతటా ఈరకంగానే ఉందోలేదో ప్రా౦తీయ దృష్టితో పరిశీలించి తెలుసుకోవచ్చు. (4) కొన్ని వ్యాకరణ ప్రక్రియలకు చెందిన విశేషా లను కూడా దేశమంతటా నూటికి పైగా కేంద్రాలను తీసుకొని సేకరించవచ్చు. ఉదా. భూతార్థక ప్రత్యయం-చెప్పాడు, చెప్పినాడు, చెప్పిండు (ఏ/ఇనా/ ఇన్): లేదా సంధికార్యాలు మొ.వి.
(26)