Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/408

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆధునికభాష : సంగ్రహవర్ణనం 393

అనుకృత వాక్యంలో కర్త లోపిస్తుంది. ప్రధాన వాక్యంలో అముఖ్యకర్మకు 'ద్వితీయావిభకక్తి వస్తుంది. క్రియకు 'అమ్‌' అనేశబ్ధం ఆగమమవుతుంది. ఆ మార్పుల్ని ఈ కింద గమనించవచ్చు. చెప్పు + అమ్‌ + అని > చెప్పమని; రా + అమ్‌ + అని > రా + మ్‌ + అని > రమ్మని.

అనుకృతిలోనేకాక కొన్ని ఇతర వాక్యాలకుకూడా 'అని' చేరుతుంది. ఇక్కడ అని విషయార్ధబోధకం. ఉదా : అతను వస్తాడని నాకు తెలును; వాడిట్లాగే చేస్తాడని నేనెరుగుదును; వాడు ప్యాసవుతాడని నాకు నమ్మకం; వాళ్ళకు పెళ్ళయిందని విన్నాను.

కొన్ని వాక్యాలలో అని కా౦క్షార్ధకం- ఇట్లాంటి వాక్యాల్లో ప్రథాన వాక్యంలో క్రియ 'ఉండు' గాని, అనుకొన , ఆలోచించువంటి వాటిల్లో ఒకటిగాని అయి ఉంటుంది. ఉపవాక్యంలో క్రియ 'వలయు > అలి' అంతంలో ఉన్నదిగాని, ఉభయ ప్రార్థన రూపంగాని అయి ఉంటుంది. ఉభయ ప్రార్థన క్రియారూపం విడిగా వాడినప్పుడు ఉత్తమబహువచనకర్తృకమై ఉంటుంది. కాని ఇక్కడ అట్లాంటి నిబంధనలేదు. ఉదా : ఆమెకు కొత్తచీర కొనుక్కోవాలని ఉంది; ఆయన కారు కొందామనుకుంటున్నాడు; వాళ్ళు ఊరికి వెళ్ళాలని ఆలోచిస్తున్నారు.

'అని చేర్చిన కొన్ని వాక్యాలు ప్రధానవాక్యానికి హేతువిశేషణాలుగా ప్రవర్తిస్తాయి. నేను పండక్కి, చీరకొనిపెట్టలేదని మా ఆవిడ అలిగింది

ఈ వాక్యాల్లో ప్రధానక్రియావ్యాపారం కర్త, లేక అనుభోక్త (Agent or experiencer) స్వాధీనంలో లేకపోతే వ్యాకారణ విరుద్ధాలవుతాయి. ఉదా : ఆమెసరిగ్గా మందులు తీసుకోలేదని జ్వరంతిరగబెట్టింది.

అది: ఒక వ్యాక్యానికి 'అది' చేర్చి ఇంకో వాక్యంతో నామపదస్థానంలో ప్రయోగించవచ్చు. ఇప్పుడది విషయార్థబోధకం అవుతుంది. వాళ్ళు ఊరికి వెళ్ళింది నాకు తెలును.

ఉపవాక్యానికీ 'అది' చేర్చినప్పుడు దాని క్రియ విశేషణంగా మారుతుంది. వెళ్ళారు + అది > వెళ్ళిన + అది > వెళ్ళింది.

క్రియాజన్యవిశేషణానికి విశేష్యంగాకూడా 'అది' చేరవచ్చు. అప్పుడు 'అది' ఆ వాక్యంలోదే ఇంకోనామాన్ని సూచించవచ్చు. ఉదా : వాళ్ళుఎక్కడికి వెళ్ళింది నాకుతెలును = వెళ్ళినచోటు.