పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/407

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

392 తెలుగు భాషా చరిత్ర

  • 'పైసలుండి ఉంటే దోసె తిన్నాను' అనే వాక్యం వ్యాకరణ సమ్మతంగా

కనపడదు.

13.17. నామ్నీకరణాలు : ఒక వాక్యాన్ని కొన్ని మార్పులతో మరో వాక్యంలో కర్తృకర్మ పదస్థానాల్లో ప్రయోగించే పద్ధతిని నామ్నీకరణంఅంటారు

అని : ఒకరన్న మాటల్ని అదే వక్తగాని, ఇంకోవక్త గాని పునశ్చరణచేస్తే దాన్ని అనుకృతి అంటారు. ఈ అనుకృతి ప్రత్యక్షపరోక్షభేదాలతో రెండురకాలు. ప్రత్యక్షానుకృతిలో మూలవక్త అన్నమాటలు అదేవిధంగా అనుకృతమవుతాయి. పరోక్షానుకృతిలో మాటలఅర్థమే అనూదితమవుతుంది. అందువల్ల ప్రత్యక్షానుకృతి శబ్ద ప్రధానం, పరోక్షానుకృతీ అర్జప్రధానం. రెండిట్లోనూ 'అని' ప్రయుక్తమవుతుంది.

ప్రత్యక్షానుకృతి : సుబ్బారావు “నేను రేపు వస్తాను: (అని) అన్నాడు. పరోక్షానుకృతి : సుబ్బారావు తను రేపు వస్తాను (అని) అన్నాడు.

ప్రత్యక్షానుకృతిలో అనుకృతవాక్యంలో ఉత్తమపురుష సర్వనామారూపొలు ప్రధానవాక్యంలో ప్రథమపురుషనామంతో నమబోధకత కలిగి ఉంటే అవికూడా ప్రథమపురుషలోకిమారి వాటికి ఏకవచనంలో తను, బహువచనంలో తము ఆదేశ మవుతాయి. క్రియావిభక్తుల్లో మార్పుండదు. ప్రథాన వాక్యంలో క్రియ అను, చెప్పు వంటి వచ్యర్థక ధాతు నిష్పన్నం. అనుధాతు నిష్పన్నక్రియ సమీపంలోఉంటే 'అని' ప్రయోగం వికల్పం.

ప్రత్యక్షానుకృతిలో ఏ శబ్దమైనా అనుకృతంకావచ్చు. అది అర్థవంతమైన శబ్దసముదాయం కావచ్చు, కాకపోవచ్చు. ఏ భాషలో దయినాకావచ్చు అసలుభాష లోనే కాకపోవచ్చు. చేష్టాదికాలుకూడా అనుకృతం కావచ్చు.

పరోక్షానుకృతిలో కథనంచేసే భాషలోని వాక్యమేకావాలి. అనుకృతిలో వాక్యాలు విధ్యాదివాక్యాలేవైనా కావచ్చు. పరోక్షవిధిలో వాటికి ఈ కింది మార్పులు జరుగుతాయి.

విధి ప్రత్యక్షవిది : అతనునాతో 'నువ్వురేపురా' (అని) అన్నాడు.

పరోక్ష విధి : అతను నన్ను రేపు రమ్మన్నాడు.