394 తెలుగు భాషా చరిత్ర
ఇందువల్ల ఒక్కోసారి వాక్యాలు భిన్నార్థబోధకాలు కావచ్చు. ఉదా : నువ్వు తిన్నది నాకు తెలుసు. దీనికి ఈ కింది రెండు వాక్యాలూ అర్ధాలే 1. నువ్వు తిన్నావని నాకు తెలుసు. 2. నువ్వు ఏంతిన్నావో నాకు తెలుసు.
13.18. ఓ, ఏమో : కిమర్థక ప్రశ్నలకు -'ఓ' చేర్చి ఇంకోవాక్యంలో ప్రయోగించవచ్చు. ఇట్లాంటి వాక్యాలు విషయార్థంలోనూ, సందేహార్థంలోనూ, పరోక్షప్రశ్నా వాక్యాల్లోనూ ఉపయోగిస్తారు. ఉదా : వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నాకుతెలును = వాళ్ళు వెళ్ళినచోటు; వాళ్ళ ఎక్కడికి వెళ్ళారో కనుక్కో. (పరోక్ష ప్రశ్న); వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఎవరికి తెలుసు (సందేహం).
సందేహార్థంలో ఉపవాక్యానికి అదనంగా 'ఏమో' శబ్దాన్ని చేర్చవచ్చు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో, ఏమో, నాకుతేలీదు. సందేహార్థంలో ఉపవాక్య౦. ప్రధానవాక్యం సాయంలేకుండానే ప్రయోగార్హం. ప్రధాన వాక్యార్థమైన 'x కి తెలీదు' ఉపవాక్యంలోనే గతార్థమవుతుంది. .
కిమర్థకశబ్దంలేని వాక్యాలకు 'ఏమో' అనే శబ్దంచేర్చి పై అర్ధాల్లో కొన్నిటికి ప్రయోగించవచ్చు. విషయార్దంలో 'ఏమో' ప్రయుక్తంకాదు. వాళ్ళు వచ్చారేమో కనుక్కో. వాళ్ళు వచ్చారేమో నాకు తెలీదు.
అటం : వ్యాపారబోధకనామాల స్టానాల్లోకూడా కొన్ని వాక్యాలను ప్రయోగించవచ్చు. అప్పుడు ఉపవాక్యానికి 'అట' చేరుస్తాం, ఇట్లాంటిరూపాలను భావార్థకాలని ప్రాచీనులన్నారు. ఉదా : ఆమెకు మిషను కుట్టటంవచ్చు. అతనికి సణగటం అలవాటు.
సామాన్య వాక్యాల్లో ప్రాధాన్య వివక్షకోసం పదవ్యత్యయం జరిగినప్పుడు కూడా క్రియ భావార్థకరూపంగా మారుతుంది. మీరు ఎందుకువచ్చారు ? -> మీరు, చావటం ఎందుకు ?
కాని ఇట్లాంటి పదవ్యత్యయం నామాన్ని సూచించే ప్రశ్నార్థక శబ్దాలున్నప్పుడు సాధ్యం కాదు.
మీరు ఏం తిన్నారు ? -> మీరుతినటం ఏమిటి ?
మీ ఇంటికకి ఏవరు వచ్చారు -> మీ ఇంటికి రావటం ఎవరు ?