Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24 తెలుగు భాషా చరిత్ర

     ii) తె. -క-/-క్క- <  -క్క-                                                                                                     
              (తెలుగులో ద్విత్వాక్షరాలు సాధారణంగా పదాదినున్న హ్రస్వాచ్చు తరవాతనే ఉంటాయి; మిగిలిన చోట్ల మూలభాషలో ఉన్న ద్విత్వాక్షరాలలో ద్విత్వం నశిస్తుంది.)                                                                    
         తె. అక్క : త. అక్కా, మ. క. తు.  అక్క  (24).
         తె. ఉక్కు : త. మ. ఉరుక్కు, క. ఉర్కు, ఉక్కు (569). 
         తె. కాకి : త. కాక్కై, మ. కాక్క, క. కాకె, కాకి (1197).
         తె. పితుకు, పిదుకు : త, మ. పితుక్కు, క, హిదుకు  (3426).
         తె. ముక్కు : త. మ, మూక్కు, క. మూగు, తు. మూకు (4122). 
                                                                 
 2.15. (i) తె. చ- <*క - (ఇ ఈ  ఎ ఏ ల  ముందు)
    మూలద్రావిడంలో ఇ ఈ ఎ ఏ ల ముందు ఉండే పదాది కకారం తెలుగులో చకారంగా మారుతుంది. దీన్ని తాలవ్యీకరణం (Palatalization) అంటారు. తెలుగు పదాల్లో మూ. ద్రా. *అయ్‌ నించి వచ్చిన ఏ కారానికి ముందు ఉన్న కకారం కూడా తాలవ్యీకరణాన్ని పొందుతుంది. (కింద 10, 12 చూడండి).                                         
                                                                           
1. తె. చిఱు, చిఱుత: త. మ, చిఱు, చిఱ్ఱు, కోత కిర్‌, క. కిఱు, తు. కిరి,                  
       కిరు (1326). 
2. తె. చిలుక : త. మ. కిళి, క. తు, గిళి, గిణి, ప. కిల్‌ (1318).
3. తె. చీము : త. మ. చీ,  కీల్, క. గీళు (1337).
4. తె. చీలు : త. కీళ్, కీల్‌, క. గీళు (1351).
5. తె. చెడు : త. మ. కెటు, క. కెడు, కిడు (1614). 
6. తె. చెదరు, చిండు : త. చితర్‌, చింతు, మ. చింతు, క. కెదఱు               
       (1294). 
7. తె. చెఱువు : త. చిఱై, మ. చిఱ, కోత కెర్‌, క, కెఱె (1648).
8. తె. చెవి, చెవుడు : త. మ. చెవి, చెవిటు, క, కివి, కివుడు, కో. నా. కెవ్‌     
       (1645).