ఈ పుట అచ్చుదిద్దబడ్డది
తెలుగు : మిగిలిన ద్రావిడభాషలు 25
9. తె. చేను : త. చెయ్, మ. చెయి, క. కయ్, కో.ప. కేన్ (1629). 10. తె. చేఁదు : త. మ. కయ, కచ 'చేదుగా ఉండు', క. కయ్, కయ్సు 'చేదు'(1047). 11. తె. చేయ :త. మ, చెయ్, క, కెయ్, గెయ్, గోం. కీ-(1628). 12. తె. చేయి : త. మ. కై, క. కయ్, ప. కెయ్, గోం. కయ్ (1683). తెలుగులో కిట్టు, కినియు, కెడయు, కెంపు, కెలయు మొదలైన కొన్ని పదాల్లో తాలవ్యాచ్చు ముందున్న కకారం చకారంగా మారలేదు. కాబట్టి ఇటువంటి పదాలు తెలుగులో తాలవ్యీకరణం జరిగి ఆగిపోయిన తరవాత కన్నడం నించి ఎరువు తెచ్చుకున్నవి అయి ఉండాలి. పై ఉదాహరణల వల్ల తెలుగులో లాగే తమిళ, మలయాళాల్లో కూడా తాలవ్యీకరణం జరిగిందని తెలుస్తుంది. కాని తమిళ, మలయాళాల్లో తాలవ్యాచ్చు తరవాత మూర్ధన్యాక్షరం ఉంటే తాలవ్యీకరణం జరగదు. తెలుగులో ఇటువంటి నిబంధన లేకపోవడమే కాకుండా దానిలో *అయ్ నించి వచ్చిన ఏకారం ముందు కూడా తాలవ్యీకరణం జరుగుతుంది. ఈ రెండు భేదాలవల్లా తెలుగులో తాలవ్యీకరణం - తమిళ, మలయాళాల్లో తాలవ్యీకరణం వేరువేరుగా జరిగినవే! కాని యీ మూడు భాషలూ ఒక భాషగా ఉన్న కాలంలో జరిగినవి కావు అని బరో (1968:45) చేప్పేరు. (ii) తె. చ - < * చ - తె. చను : త. మ. చెల్, క. సల్, ప. చెన్, కూ. సల్ (2286). తె. చావు : త. మ. చావు, క. సావు (2002). తె. చిక్కు : త. మ. చిక్కు, క. సిక్కు, క. సిల్కు, సిర్కు (2060). తె. చుక్క : త. చుక్కై, క. చుక్కె, గోం. సుక్కుం (2175). తె. చూలు : త. మ. క. చూల్ (2255). తె. చేరు : త. మ. చేర్, క. సేర్ (2312).