374 తెలుగు భాషా చరిత్ర
సర్వనామాల్లోనూ, విశేషార్థాల్లో ప్రయోగించే సంఖ్యావాచక శబ్దాల్లోనూ బహువచననామాల్లోనూ తప్ప మిగతాచోట్ల ఔపవిభక్తికత నేటిభాషలో క్రమక్రమంగా క్షీణిస్తున్న సూచనలగపడుతున్నాయి. ఉదా : పంటినొప్పి ~ పన్ను నొప్పి, రోకటిపోటు ~ రోకలిపోటు, చేతిమీద ~ చెయ్యిమీద.
13.9. నామవిభక్తులు 1 ను కర్మర్థంలోనూ, కు సంప్రదానాది అర్ధాల్లోనూ నామానికి చేరతాయి. వీటికి ఇకారాంతశబ్దాల తరవాత ని కి అనే రూపాలున్నాయి. విభక్తి చేరినప్పుడు సర్వనామరూపాల్లో కొన్ని మార్పులీ కిందివిధంగా జరుగుతాయి. నా+ను>నన్ను, నీ+ను>నిన్ను, మా+ను>మమ్మల్ని, మీ+ను> మిమ్మల్ని, మన + ను > మనని, మనల్ని.
నా, నీ, మాా, మీల తరవాత ఎప్పుడూ కు ను లే ఉంటాయి. మిగతా శబ్దాల్లో ఇకారేతర స్వరం తరవాత ని, ను లు కి, కులలో ఏదైనారావచ్చు. మాటకు ~ మాటకి, ఆవును ~ ఆవుని.
2. కు ఈ కింది అర్థాల్లో ప్రయుక్తమవుతుంది.
(a) 'ఉండు' క్రియతో స్వామ్యార్థంలో, ఉదా. నాకుకళ్ళజోడుఉంది. వాడికి పది ఎకరాల పొలం ఉంది.
(b) దేహమనుస్థితి బోధకాఖ్యాతాలతో, ఉదా. నాకు ఆకలిగా ఉంది. వాడికి కోపంగా ఉంది.
(c) 'అని' కాంక్షార్థంలో వచ్చినప్పుడు, ఉదా. నాకు వెళ్ళాలని ఉంది.
(d) దానార్థకక్రియ ఉన్నప్పుడు గ్రహీతకు, ఉదా. వాడికి రెండు రూపాయలిచ్చాను.
(e) కొన్ని జ్ఞానార్థక క్రియలతో, ఉదా. నాకు వాళ్ళు తెలుసు. నాకు హిందీరాదు.
(f) కొనుగోలు, మార్పిడి మొదలైన అర్థాల్లో ఉదా. రూపాయికి నాలుగు మామిడిపండ్లు.
(g) బాంధవ్యార్థంలో, ఉదా. వాళ్ళకు ఇద్ధరు పిల్లలు. అయన నీకే మవుతాడు ?