ఆధునికభాష : స౦గ్రహవర్ణనం 375
(h) సామాన్య సంబంధార్థంలో, ఉదా. ఈ గదికి రెండు కిటికీ లున్నాయి. ఆవుకు రెండు కొమ్ములుంటాయి.
(i) ప్రయోజనార్థంలో, ఉదా. చల్లకు వచ్చి ముంతదాచటం ఎందుకు.
(j) గమ్యార్థంలో, ఉదా. రేపు ఊరికి వెళ్తున్నాను.
(k) హేత్వర్థంలో, ఉదా. చలికి వణుకుతున్నాడు. పిల్లికిభయపడ తాడు. ఆకలికి తట్టుకోలేడు.
(l) కాలార్థంలో, ఉదా. రేపటికి వస్తాడు. ఎల్లుండికి ఈపని అవుతుంది
(m) వచ్యర్థథాతువులకు అముఖ్య కర్మగా, ఉదా. నాకు చెప్పాడు.
3. తో ఈ క్రింది అర్దాల్లో ప్రయుక్తమవుతుంది.
(a) కరణార్థంలో, ఉదా. నోటితో మాట్లాడి నొసలుతో వెక్కిరిస్తాడు.
(b) సహార్థంలో, ఉదా. వాడు ఆ అమ్మాయితో పారిపోయాడు.
(c) వచ్యర్థధాతువుల అముఖ్యకర్మగా, ఉదా. అతనితో మాట్లాడాను. వారితో చెప్పాను.
(d) రీత్యర్థంలో (manner), ఉదా. శ్రద్ధతో చదువుతాడు.
(e) కర్త్రువిశేషణంగాా, ఉదా. అతను ఆకలితో వచ్చాడు. ఆమె జ్వరంతో పరీక్ష రాసింది
(f) ప్రతి క్రియాపేక్షక క్రియలతో, ఉదా. ఇండియా పాకిస్తాన్ తో యుద్దంచేసింది. ఆమె పక్కవాళ్ళతో ఎప్పుడూ పోట్లాడుతుంది.
(g) మూలపదార్థార్థంలో, ఉదా. కర్రతో చేసినకుర్చీ, పిండితోచేసిన రొట్టె, మట్టితో పెట్టిన గోడ.
4. లో ఈ కింది అర్థాల్లో ప్రయుక్తమవుతుంది.
(a) ఔపశ్లేషికార్థంలో, ఉదా. గిన్నెలో పాలున్నాయి.
(b) కాలార్థంలో, ఉదా. విశాలా౦ధ్ర 1956 లో ఏర్పడింది.
(c) దేశకాలాల వాతావరణార్థంలో, ఉదా. బెజవాడలో ఎండలెక్కువ. సెష్టె౦బరులో వాన లెక్కువ.