Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/388

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆధునికభాష : స౦గ్రహవర్ణనం 373.

7. ఇదంతమైన రెండచ్చుల మాటల్లో దీర్ఘస్వర పూర్వకమైన 'య' వర్ణానికి 'త' వర్ణాదేశం అవుతుంది. ఉదా: చేయి, చేతిపని, రాయి ; రాతిగోడ, గోయి : గోతిలో, నేయి : నేతిమిఠాయి.

'నోరు' అనే అర్ద౦లో 'వాయి' నుడికారాల్లో మాత్రమే మిగిలింది. ఉదా. నోరూవాయీ లేనివాడు. వేరే 'వాయి' శబ్దం అనౌపవిభక్తికం. “ఒక్కోవాయికి" దాయిశబ్దానికి 'ధాతి' అనే రూపమే ప్రథమలోకూడా స్థిరపడింది.

8. అర్రువంటి మాటల్లో చివరి అక్షరాని (syllable) కి 'తి' ఆదేశమవుతుంది. ఉదా. ఆరు; ఆ ర్తిపుండు, గొర్రు: గొర్తిఅడ్డ.

9. ఈ కిందివి 'టి' ఆగమంగా వచ్చే వాటిల్లో కొన్ని.

(a) మారుటితల్లి, పొద్దుటిపూట, మాపటివేళ, రేపటికి, చాలా సేపటికి.

(b) నిన్నటిపత్రిక, మొన్నటిపని, ఇవాళటివంట.

(c) పుల్లటి మజ్జిగ, తియ్యటిరసం, చప్పటికూర, చక్కటి అమ్మాయి.

అట్లాగే ఇంకా అంతటి, అన్నిటి, కిందటి, అట్లాటి మొ. వి.

10. 'ను, లు, రు, డు' అంతంలో ఉన్న శబ్దాల్లో చివర 'ఉ' 'ఇ' గా మారింది. మనుష్యవాచక శబ్దాల్లో ఈ మార్పు క్రమబద్ధంగా కనిపిస్తున్నది. ఉదా. చేను ; చేనికి (కాని 'చేలో'), ఊరు : ఊరికి, కాలు : కాలికి, వారు : వారికి, వాడు: వాడికి, అతను ; అతనికి, అల్లుడు : అల్లుడికి, చెల్లెలు : చెల్లెలికి, కోడలు : కోడలికి.

11. సంఖ్యావాచకాలకు భిన్నార్థాల్లో 'టి, ఇంటి', అనే ప్రత్యయాలు ఆదేశాగమాలుగా వస్తాయి. ఉదా. మూడిటికి /మూడింటికి ఇరవై అయిదు పైసలు. పదకొండింటికి వస్తానన్నాడు.

12. ప్రథమేతర సర్వనామాలకు విశేషణ రూపాలు (oblique forms) ఇట్లా ఉంటాయి. ఉదా. నేను-నా, మేము-మా, మనం-మన, నీవు/నువ్వు-నీ, మేరు-మీ.