Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/383

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

368 తెలుగుభాషా చరిత్ర

కాని గూడు-లు-లేవు > గూళ్ళులేవు, కోటు-లు-లేవు > కోట్లులేవు.

ఇక్కడ పూర్వపరిసరంలోనే అచ్చుపోయింది. మొదటిది సంధి పరిసరం కాదు; పదనిర్మాణ పరిసరం.

7. ద్విరుక్త వ్యంజనం ఇంకోవ్యజనం ముందు అద్విరుక్త మవుతుంది. బహువచనాది ప్రక్రియలో స్వరలోపంవల్ల ఈ రకం పరిసరం ఏర్పడుతుంది.

చెట్టు + లు > చెట్ట్‌ +లు > చెట్లు

గుడ్డు + లు > గుట్ట్‌ + లు > గుడ్లు

తొట్టి + లో > తొట్ట్‌ + లో > తొట్లో

13.7. నామపదనిష్పత్తి : బహువచనం: ఏకవచన నామానికి 'లు' అనే ప్రత్యయం చేరిస్తే బహువచననామం అవుతుంది. ప్రకృతి ప్రత్యయ విభాగం లేకుండానే కొన్ని నామాలు బహువచన భోధకాలు. ఉదా : పాలు, నీళ్ళు, పెసలు, ఉసిళ్ళు, పేలాలు, బియ్యం. వీటికి వ్యస్తంగా ఏకవచన ప్రయోగంలేదు. ఇట్లాంటి వాటిని నిత్యబహువచనాలంటారు. బహువచన ప్రత్యయయోగంలో ఏకవచననామంలో కొన్ని మార్పులు జరుగుతాయి.

1. దీర్ఘ స్వరాంత శబ్దాల్లో మార్పులుండవు. ఉదా : లుంగీలు, లంగాలు. ప్రాయికంగా ఇవి అన్యదేశ్యాలు.

2. అగ్రేతర (ఇ, ఉ లుకాక) స్వరాంతశబ్దాల్లో అంత్యస్వరలోపం త్వరితోచ్చారణలోనే ఏర్పడుతుంది. ఉదా : గోడలు, కోడెలు.

3. కొన్ని శబ్దాల్లో తుది అవరం (Syllable) లోపిస్తుంది. ఉదా : పేను + లు > పేలు, చేను + లు = చేలు, పూవు+లు=పూలు, వేయి+లు=వేలు.

కొందరి వాడుకలో పేండ్లు, చేండ్లు అని ఉన్నాయి. కొందరి వ్యవవారంలో 'పువ్వులు' అనేరూపం ఉ౦ది.

4. ఇదంత శబ్దాల్లో అకారేతర దీర్ఘస్వరపూర్వకమైన 'య' కారానికి 'త' కారం ఆదేశం అవుతుంది. ఉదా : చేయి+లు>చేతి=లు, గోయి+లు>గోతి+లు, నూయి+లు>నూతి + లు,

పొయ్యి, వాయి; రాయి అనే శబ్దాలకు క్రమంగా 'పొయ్యిలు, వాయిలు, రాళ్ళు' అనే రూపాలు బహువచననాలు.