ఆధునికభాష : స౦గ్రహవర్ణనం 369
5. 'ల్లు , న్ను' అంతంలో వచ్చే ఔపవిభక్తిక నామాలకు '౦డు" ఆదేశమవుతుంది. ఉదా : కన్ను+లు>కండు+లు>కండ్లు, కల్లు +లు>కండు+లు>కండ్లు, పల్లు, పన్ను+లు>పండు+లు>పండ్లు, పల్లు (= పల్లం), కల్లు (= మద్యం) లు అనౌపవిభక్తికాలు.
6. 'లి' అంతలో వచ్చే చతుర్మాత్రాక శబ్దాల్లో ౦డి ఆదేశం జరుగుతుంది. ఉదా: రోకలి+లు>రోకండ్లు, తిరగలి+లు>తిరగండి+ లు>తిరగండ్లు, కౌగిలి+లు>కౌగిండి+లు>కౌగిండ్లు.
7. -ండి -ండు అంతగా ఉన్న శబ్దాల్లో అనునాసిక వర్ణానికి కొందరి భాషలో లోపం జరుగుతుంది. ఉదా : బండి+లు>బండ్లు, బళ్ళు, పుండు+లు>పుండ్లు, పుళ్ళు, తిరగండ్లు, తిరగళ్ళు. [చూ. సంధి సూత్రాలు].
8. రెండక్షరాల కన్నా ఎక్కు వున్న ఇదంత శబ్దాల్లో చివరి వ్య౦జనమైన 'ల' కారం మూర్థన్యమవుతుంది. ఉదా : మొసలి+లు>మొసళ్ళు, నెమలి+లు>నెమళ్ళు. మొసండ్లు అనే రూపాలుకూడా ఉన్నాయి. అప్పుడు వీటిని 6వ సూత్రంలో చేర్చుకొని 'చతుర్మాత్రాక' బదులు 'ద్విమాత్రాధిక” శబ్దాల్లో అనాల్సిఉంటుంది. ఉలి, పులి, పిల్లి రెండక్షరాల మాటలు.
9. ఉదంత శబ్దాల్లో చివరి స్వరానికి ముందున్న 'ల' కారం మూర్థన్యమవుతుంది. ఉదా: కాలు+లు>కాళ్ళు, కుందేలు+లు> కుందేళ్ళు.
10. కొన్నిచోట్ల చివరి అచ్చుకు ముందున్న రేఫం కూడా మూర్థన్యలకారం అవుతుంది. ఉదా : వేరు + లు > వేళ్ళు, ఊరు + లు > ఊళ్ళు, గోరు + లు > గోళ్లు , వెదురు+లు>వెదుళ్లు, పందిరి +లు > పందిళ్లు. ఇట్లాంటి శబ్దాలు ప్రాయికంగా త్రిమాత్రాకాలు, చతుర్మాత్రాకాలు అరుదు.
11. ఏకవచనంలో లేని అనునాసికవర్ణం బహువచనయోగంలో కొన్ని శబ్దాల్లోచేరుతుంది. ఉదా : కాడి + లు > కాండి + లు, ఏడు + లు > ఏ౦డు + లు. (ఈ శబ్దాల్లోని అనునాసికవర్ణ౦ ప్రాచీనం ; బహువచన రూపాల్లో మాత్రం మిగిలింది.
'కాండి' ని వ్యాకరణమూలరూపం (underlying form) గా గ్రహిస్తే దీర్ఘాచ్చుమీది అనునాసిక వర్ణానికి ఇంకోహల్లు ముందులోసం చెప్పి ఏకవచన
(24)