Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/382

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆధునికభాష : సంగ్రహవర్ణనం 367

(c) పూర్వవ్యంజనం మూర్దన్యమయి, పరవ్యంజనం దంతమూలీయ మయినప్పుడు,

(d) పూర్వవ్యంజనం దంత్యమై పరవ్యంజనం స్పృష్టోష్మమైనప్పుడు, (చ, జ) మధ్యనున్న హ్రస్వాచ్చు లోపిస్తుంది.

ఉదా : (a) చేప + పిల్ల > చేప్పిల్ల, పిరికి + గుండె >పిరిగ్గు౦డె.

(b) కాలి + తో > కాల్తో, నూనె + తో > నూన్తో, తల + నూనె > తల్నూనె, మన + లో > మన్లో, పాల + డబ్బు < పాల్డబ్బు, మన + చోటు + మన్చోటు, పాల + చెంబు > పాల్చెంబు.

(c) మూట + లో > మూట్లో, వాడి + ని > వాణ్ని.

(d) పాత + చింతకాయ > పాచ్చింతకాయ.

6 (a) స్వరలోపానంతరం - పరంలో చ, జ లున్నప్పుడు పూర్వంలో త, ద, లు కూడా చ ,జ లుగా మారతాయి;

(b) పరవ్యంజనం శ్వాసమైతే పూర్వువ్యంజనం శ్వాసంగానూ, నాదమైతే నాదంగానూ మారుతుంది;

(c) 'న, ల' లు మూర్దన్య వర్ణసంయోగంలో (పూర్వంకాని, పరంకాని) మూర్ధన్యపరాలుగా మారుతాయి.

ఉదా: పాత + జల్లెడ > పాజ్జల్లెడ, ఇరుకు + గది > ఇరుగ్గది, పాదు + తవ్వి > పాత్తవ్వి, నీడ + లో > నీళ్ళో, పాల + డబ్బా > పాళ్డబ్బా.

సంధి జరగటానికి వీలున్న రెండు పరిసరాలు వెంటవెంటనే ఉండి సంధి జరిగితే కొన్నిచోట్ల మూడుహల్లుల సంయోగం ఏర్పడుతుంది. అట్లాంటిచోట్ల పర సంధి ముందుగా జరిగి పూర్వసంధిని నిరవకాశ౦ చేస్తుంది.ఉదా: మాటలు + రావు > మాటల్రావు, గుడ్డలు + లేవు > గుడ్డల్లేవు.

కొన్నిచోట్ల పూర్వపరసంధుల్లో ఏదైనా జరగొచ్చు. దారి + లు + లేవు > దార్లులేవు, దొరుల్లేవు, కారు + లు + లో > కారు + ల + లో > కార్లలో, కారుల్లో.

సంధికి ప్రమేయంఉన్న వ్యంజనాలు ఏక స్థానికాలయినప్పుడు ఇట్లా పూర్వపర సంధులమధ్య వికల్పత్వం కనిపిస్తున్నది.