362
తెలుగు భాషా చరిత్ర
కొన్ని అన్యభాషా పదాలు కావచ్చు) వంటి నామాల్లోను, కుళ్లు, తుళ్లు, మళ్లు, వెళ్లు వంటి కొన్ని క్రియల్లోను, మళ్లీ వంటి అవ్యయంలోను కనిపిస్తున్నది. ఇవి పది పన్నెండు శబ్దాలకన్నా మించిలేవు. వ్యాకరణ కార్యాలవల్ల కళ్లు, పళ్లు, ముళ్లు, కాళ్లు, కోళ్లు, తాళ్లు, తేళ్లు వంటి మాటల్లోనూ, అవ్యవహితోచ్చారణలో డ-ల వర్ణ సంయోగంవల్ల ఈ 'ళ' వర్ణోచ్చారణ వినిపిస్తుంది. చాలామంది శ్రామికుల ఉచ్చారణలో ఈ 'ళ' వర్ణోచ్చారణ వినిపించదు.
రేఫం : రేఫవర్ణ౦ దంతమూలీయకంపితం. సంయోగంలో ట వర్గ వర్ణాల తరవాత వచ్చినప్పుడు మూర్థన్యోచ్చారణ ఉంది. ఉదా: కుట్ర, కొండ్ర, తండ్రి. మిగతాచోట్ల దంతమూలీయోచ్చారణ ఉంది. ద్విరుక్తిలో ఇది అధిక కంపిత మౌతుంది. ఉదా : కర్ర, కర్రు. తవర్గ వర్ణాల తరవాత దంత్యోచ్చారణ ఉంది. ఉదా: పాత్ర, పొత్రం, ఆత్రం.
అంతస్థాలు : కొంత స్వరధర్మం, కొంత వ్యంజన ధర్మం ఉన్న వర్ణాలు అంతస్థాలు. య వర్ణ౦ ఉచ్చారణలో 'ఇ' వర్ణతుల్యం. 'వ' 'ఉ' వర్ణ తుల్యం. ఉచ్చారణలో సర్వతుల్యత్వం ఉన్నా అక్షర (Syllable) నిర్మాణంలో వ్యంజనాల్లాగే ప్రవర్తిస్తాయి.
య, వ లు ద్విరుక్తిలో ఎక్కువ ఒరపిడితో ఉచ్చరిత మవుతాయి. ఉదా: అయ్య, అవ్వ.
పదాదిన తాలవ్యాచ్చులముందు 'య' కారోచ్చారణ; ఓష్ట్యాచ్చుల ముందు 'వ' కారోచ్చారణ అదనంగా వినిపించినా అక్కడ వీటికి వర్ణత్వంలేదు. అదైనా నియతంకాదు. ఇవి లేని ఉచ్చారణ కూడా తరచుగా వినిపిస్తుంది. ఉదా : ఇది-యిది; ఎవరు-యెవరు; ఊరు-వూరు; ఒకడు-వొకడు.
అచ్చులు: నాలుక మూర్థం వైపుగా లేచే ఎత్తునుబట్టి, ఉచ్చారణలో నాలుక ముందు, మధ్య, వెనక భాగాల ప్రాధాన్యాన్ని బట్టి, పెదవుల ఆకారాన్ని బట్టి అచ్చుల విభాగం ఉంటుంది. తెలుగులో ఇ, ఈ, ఎ, ఏ లు నిరోష్ట్యతాలవ్యాచ్చులు. ఉ, ఊ, ఒ, ఓ లు ఓష్థ్య పశ్చాదచ్చులు. అ, ఆ లు కేంద్ర నిస్తాలవ్య నిరోష్ట్యాచ్చులు. ఇ, ఈ, ఉ, ఊ లు అగ్రాచ్చులు; ఎ, ఏ, ఓలు మధ్యాచ్చులు; అ, ఆ లు నిమ్నాచ్చులు. తెలుగు అచ్చులకు పరంలో అ, ఆ లు వచ్చినప్పుడు వివృతోచ్చారణ ఉంది. ఉదా : పిల్లి-పిల్ల: పీకు-పీక, మెట్టు-మెట్ట, మేకు-మేక, గుడ్డు-గుడ్డ, గూడు-గూడ, గోడు-గోడ, కంపు-కంప, కాడు-కాడ, ఈ ఉచ్చా