Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/378

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆధునికభాష - స౦గ్రహవర్ణనం

363

రణ భేదం కోస్తా జిల్లాలో అధికంగా ఉండి. ఈ స్వరవివృతి కొందరి ఉచ్చారణలో సంస్కృత శబ్దాలో కూడా వినిపిస్తుంది. ఉదా క్షేత్రయ్య, సేకరణ. ఇది ఇతర మండలాల్లో అరుదు.

ఈ ఉచ్చారణ భేదం ఉన్నచోట్ల వివృతిని కలిగించిన 'అ' కారం సంధిలోగాని, వ్యాకరణ కార్యంలోగాని లోపించినా ఈ వివృతోచ్చారణ నిల్చి ఉంటుంది. ఉదా : మేకు + అ, మేక+అ.

ఈ వివృతిని అక్షరం కింద గీత ద్వారా సూచిస్తే క్రియల్లో ఈ విధంగా నిష్పత్తి చూపించొచ్చు. లే + అక > లేక, పో + అక > పోక.

ఇదికాక వివృతమైన ఏ ఉచ్చారణ క్రియల్లో ఇ + అచ్చుల సంయోగం వల్ల కూడా ఏర్పడుతుంది. ఉదా : ఆగి + ఆడు > ఆగేడు, చెప్పి+ఆడు > చెప్పేడు, వెళ్ళి + ఆడు > వెళ్లేడు.

పదాంతంలోనూ, మకారాంత పదాల్లో చివరి 'మ' కరానికి పూర్వం వచ్చినప్పుడు 'ఎ' వర్ణానికి వివృతోచ్చారణ ఉంది. ఉదా: గిన్నె, పళ్లెం.

ఈ విధంగా వివృతోచ్చారణను సూత్రబద్ధం చేసి చెప్పవచ్చు గాబట్టి వివృతాచ్చులను ప్రత్యేకవర్జాలుగా కాక ఉచ్చారణ భేదాలుగా గుర్తిస్తేచాలు.

తెలుగు సంధిలో అచ్చులు లోపించినప్పుడు ఇంకా చాలా ఉచ్చారణ భేదాలు విసిపిస్తాయి. అవి సంధిలో ప్రస్తావించబడతాయి.

13.5. వర్ణసంయోజన నియమావళి : ఏ భాషలోనయినా అన్నిపర్ణాలు అన్ని పరిసరాల్లోనూ తావు. కొన్నిరకాల వర్ణ సంయోజనాలు మ్మాతమే సాధ్యమవుతాయి. కేవల ఏకశబ్దపరిమితిలో తెలుగు మాటలనే తీసుకొంటే ఈ కింది నియమాలను గమనించవచ్చు.

1. య, ణ, ళ అనే వ్యంజనాలు పదాదినరావు. - 'యాభై' 'యాస' లలో ఆదివర్ణ౦ 'య' కారంగా గుర్తిస్తే ఈ శబ్దాలు ఇందుకపవాదాలవుతాయి.

2. ట వర్ణం పదాదిన అరుదు. డ వర్ణం మాత్రం కొన్ని మాటల్లో కనబడుతున్నది. తెలంగాణంలో తొంభైకి టొంబై అనేరూపం ఉంది. ఉదా : టక్కరి, టెంక, టెంకాయ, డేకు, డోకు, డబ్బు, డెక్క, డెబ్బై, డేగ.

3. పదాది 'వ' వర్ణం తరవాత ఓష్ట్యేతరాచ్చులే రాగలవు. ఉదా : వల, వాడు, విల్లు, వీలు, వెన్న, వేట.