Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/376

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆధునికభాష : సంగ్రహవర్షనం

ఈ ఉచ్చారణం విద్యావంతుల భాషలోలేదు.. సంస్కృత శబ్దాలయినా, సంవత్సరం, వంశం, మాంసం, సింహం వంటి మాటల్లో పదాంతంలోను, సంయోగంలోను వ, శ, స, హ ల ముందు ఉచ్చారణఉంది. ఈ అనునాసిక వకారోచ్చారణ కోస్తాజిల్లాల్లో ఎక్కువగా ఉంది. తెలంగాణ, రాయలసీమ వ్యవహర్తలందరిలో ఈ ఉచ్చారణలేదు. పరోక్ష విధిలో ఆగమంగావచ్చే 'మ' వర్ణానికి మాత్రం అచ్చుల మధ్య అయినా స్పృష్టోచ్చారణే ఉంది. ఉదా : చెప్పమన్నాడు.

'న' వర్ణానికి పదాదిన, ద్విరుక్తిలో, అచ్చులమధ్య దంతమూలీయోచ్చారణ ఉంది; దంత్యవర్ణాలముందు దంతోచ్చారణ ఉంది. ఉదా : నాన్న, కొంత.

తెలుగులో 'ఙ', 'ఞ' అనే గుర్తులతో సూచించే ఉచ్చారణ క్రమంగా క వర్గ, చ వర్గ వర్గాలముందే ఉంది కాబట్టి వీటిని ప్రత్యేకవర్ణాలుగా గుర్తించనక్కర్లేదు. భాషా పరిశోధకులు వీటిని 'న' వర్ణోచ్చారణ భేదాలుగానే గుర్తిస్తున్నారు. మవర్ణ భేదాలుగా గుర్తించినా ఇబ్బందిలేదు.

'ణ' వర్ణం అచ్చులమధ్య, ట వర్గ స్పర్శాలముందు వస్తుంది. దీనికి ద్విరుక్తి సంధిలోమాత్రమేఉంది. గుర్తించదగిన ఉచ్చారణ భేదాలు లేవు. అచ్చుల మధ్య మాత్రం కొద్దిగా శిథిలోచ్బారణ ఉంది.

ద్విరుక్త 'ణ' కార ఘటితమైన 'దణ్డె౦' అనే రూపం కొన్నిచోట్ల వినిపించినా దానికి పూర్వరూపమైన 'దండెం' కూడా వ్యవహారంలో వినిపిస్తుంది. 'గొణ్ణ౦' అనే శబ్దానికి గొళ్ళెం, గొండెం అనేరూపా౦తరాలున్నాయి. దీనికి 'గొండ్లెము' అనేది పూర్వరూపం.

మ, న వర్ణాలకున్న పరిసర బాహుళ్యంగాని, బహుశబ్ధ ఘటితత్వంగాని 'ణ' వర్ణానికి లేవు. గ్రామీణుల వ్యవహారంలోగాని, శ్రామికుల వ్యవహారంలోగాని ట వర్గ వర్ణాలముందు తప్ప దీని ప్రయోగం కనిపించదు.

పార్శ్వికాలు : పార్శ్విక వర్ణాల్లో దంతమూలీయ, మూర్ధన్యభేదం ఉంది. 'ల' దంతమూలీయం, 'ళ' మూర్ధన్యం; వీటికి గుర్తించదగిన ఉచ్చారణ భేదాలు లేవు.

'ళ' వర్ణం పదాదిన రాదు. అద్విరుక్తిలో 'ళ' వర్ణ ఘటితశబ్దాలు దొరకటం కష్టం. ద్విరుక్తిలో సమీకరణంవల్ల ఏర్పడ్డ ఒళ్లు , కళ్లెం, పళ్లెం, గొళ్లెం (వీటిలో