పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/375

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

360

తెలుగు భాషా చరిత్ర


'f’ ముఖ్యంగా ఉర్దూ నుంచి, ఇంగ్లీషునుంచి, వచ్చిన మాటల్లో ఉంది.ఉధా ఫసలీ, ఫైసలు, కాఫీ. ఈ వర్ణోచ్చారణ కొందరి వ్యవహారంలో సంస్కృత 'ఫ' వర్లో బ్చారణకు బదులుగానూ, సంఖ్యావాచకాల్లోనూ ఉంది. ఉదా : కఫం, ఫలితం, నలఫై, యాఫై, ఎనఫై.

ఇతర భాషలనుంచి తెలుగులో వచ్చి స్థిరపడిన అచ్చులు లేవు. ఆధునిక భాషలో వివృతమైన ఎ, ఏ లు, ఓ, ఓ లు ఇంగ్లీషు మాటల్లో వినిపించినా అవి స్థిరపడ్డట్టు కనిపించదు. ఒక్క ఏ మాత్రం గుర్తించదగినంతగా చాలామంది వ్యవహారంలో వినిపిస్తుంది. ఉదా : bank, cash, glass మొ -; తెలుగులో భూత కాల సమాపక క్రియల ఉచ్చారణలో కొన్ని మండలాల్లో ఉంది. ఉదా: వచ్చాడు, ఆగాడు మొ.


13.4. తెలుగు వర్ణాల ఉచ్చారణ : హల్లులు : సర్శాలు : స్పర్శా లన్నిటికి పదాదిన, సంయోగంలో అధిక స్పృష్టోచ్చారణ (fortis articulation , అచ్చులమధ్య అల్పస్పృష్టోచ్చారణ (levis articulation) ఉంది. నోటిలో కండరాలను కుంచించి ఎక్కువ వత్తిడితో ఉచ్చరించే వాటిని అధిక స్పర్శాలంటారు. కండరాలను వదుల గా ఉంచి ఉచ్చరించిన వాటిని అల్పస్పర్శాలంటారు. ఈ అల్పస్పృష్టోచ్చారణ నాదవర్ణాల్లో ఎక్కువగా గుర్తించవచ్చు. ఉదా : గడ, పగలు దారీ, పొద.

అచ్చుల మధ్య 'డ' వర్ణం హిందీ భాషలో వినిపించే శిథిల స్పర్శంతో తుల్యోచ్చారణ కలిగి ఉంటుంది, ఉదా : గడ, పడవ.

స్పృష్టోష్మాల్లో 'జ' వర్ణానికి అచ్చులమధ్య ఉష్మోచ్చారణ ఉంది. ఉదా : గాజు [gazu), బూజు [buzu). స్పష్టోష్మాలకు తాలవ్యాచ్చులముందు తాలవ్యొచ్చారణ, తాలవ్యేతరాచ్చులముందు దంతమూలీయోచ్చారణ ఉంది. ఉదా : చిన్న, చీమ, చెల్లెలు, చేదు, చేట; ౘక్క, ౘూపు,ౘొక్కా, ౘొటు ౘల్ల, ౘాప. ఈ ఉచ్చరణభేదం అన్ని మండలాల్లోనూ లేదు. తాలవ్యోచ్చారణ మాత్రమే ఉంది.

అనునాసికాలు : 'మ' వర్ణానికి అచ్చుల మధ్య, పదాంతంలోను అనునాసిక 'వ' కారోచ్చారణ ఉంది. సంస్కృతాది భాషలనుంచి వచ్చిన శబ్ధాలో మాత్రం