348
తెలుగు భాషా చరిత్ర
12. 9. సంధి కాలంలో లిపి పెక్కుమార్పులు చెందింది. చకారానికి తలకట్టు వచ్చింది. ఛ కారం ఎడమభాగం గుండ్రనైంది. ఠ, థ, ధ, లకు తలకట్లు వచ్చాయి. ఫ, భలు చాలా మారాయి. అనుస్వారం చక్కగా చూపినా, బిందు రూపంలో చూపినా అక్షరం పై భాగంలోనో, అక్షరానికి ఎగువ కుడిభాగంలోనో పెట్టే అలవాటు మారి అక్షరం పక్కన సపంక్తిలో పెట్టడం అలవాటయింది. మహా ప్రాణాలకు ఒత్తులు-పొల్లులు ఏర్పడ్డాయి. ఒత్తుమొదట్లో బోరగిలవేసిన అర్థచ౦ద్రాకారంగా ఉండి క్రమంగా పొక్కిలిలో నిలువుగీతగా నిలిచింది.
12. 10. రెడ్డిరాజులకాలానికి-శ్రీనాథుని కాలానికి-ఒకటి రెండక్షరాలు మినహాగా అన్నీమారాయి. అప్పటికి తెలుగులిపి ప్రపంచంలో పడ్డామనిపిస్తుంది. ఇప్పటి తెలుగులిపి సన్నిహితదశ ఏర్పడింది. 'క' పూర్తిగా మారి ఇప్పటి రూపానికి వచ్చింది. 'ష' స్పష్టంగా నేటి రూపం తాల్చింది.
చ, జ లకు [ts], (dz) అనే దంత్యోచ్చారణఉంది. దీనిని తెలపడానికి చ, చలపై త ఒత్తు---- వంటి, తెలుగు రెండుఅంకెవంటి గుర్తుపాత తెలుగు అచ్చు పుస్తకాలలో కనిపిస్తుంది. వ్రాతలో అలాటి గుర్తువాడడం అరుదు. ఈ ఉచ్చారణగల వర్ణాలను మన వైయాకరణులు దంత్య చ, జ లు అని అన్నారు. వీటి ఉచ్చారణ తెలుపడానికి వీటిపైన చుక్కలు పెట్టాలని అప్పకవి సూచించాడు. త్స, ద్స, ఱ, ళ లు తెలుపడానికి చజరలలపై చుక్కలు పెట్టాలని అతని సూచన. 16వ శతాబ్దికి పూర్వపు తాటాకు పుస్తకాలలోగాని, కడితాలవ్రాత ప్రతులలోగాని ఇలాటి గుర్తులున్నాయేమో చూడవలెనంటే, మనకు అప్పటి వ్రాత ప్రతులు దొరకరేదు. శాసనాలలో ఇలాటిగుర్తులులేవు. ఱ, ళ లకు ప్రత్యేక స్వరూపాలే ఉన్నాయి. దంత్య చ, జ లను పేర్కొనడానికి ఈ-'_' గుర్తును ఏర్పాటుచేసినవారు 19వ శతాబ్దిలో సి. పి. బ్రౌను. చ వర్గంలో మొదటి చ పైన తెలుగు “౧” గుర్తు, దంత్య చకారం పైన తెలుగు '_' గుర్తువేయించాడు ఈయన. దీనిని రావిపాటి గురుమూర్తి శాస్త్రి తన వ్యాకరణంలోను పొందుపరిచారు. (తెలుగువ్యకారణము, అక్షర లక్షణ ప్రకరణము).
12. 11. తెలుగులో అరసున్న మరొక వింతలిపి. ఇదికూడ వ్రాతలో 16వ శతాబ్దికి ముందు కనిపించదు. 12వ శతాబ్దినాటిదనిచెప్పే అధర్వణకారికావళి