తెలుగులిపి పరిణామం
347
ముందుకన్నా ఎంతగా మారిందో గ్రహించగలం. నన్నయకాలానికీ మనలిపి బాగా తలకట్టు దిద్ధుకొని చదికిలబడింది.
12.8. నన్నయకాలంనుంచి వేంగీ-చాళుక్యలిపిలో మార్పులు ప్రారంభమై తర్వాత రెండు వందల సంవత్సరాలకు కన్నడ - తెలుగులిపులను రెండుగా విడదీశాయి. అంతవరకు ఈ లిపి రాజమహే౦ద్రవరంనుంచి పశ్చిమ సముద్రతీరంవరకు వ్యాప్తిలో ఉండేది. దీనిని కచ్చితంగా తెలుగులిపి అనిగాని, కన్నడలిపి అనిగాని అనలేము. క్రమంగా తెలుగు మరీ గుండ్రనైంది; కన్నడలిపి కోణాకారమైనది. కాకతీయల కాలానికి ఈ మార్పు స్థిరపడింది. మంచన, జక్కన తెలుగులిపిని ప్రత్యేకంగా తెలుపడం దీనికి ఉదాహరణం. ఈ లిపి పరిణామవృక్షం కింద సూచించిన రీతిగా భావించవచ్చు.
దక్షిణ్యబ్రాహ్మి | గుహాలిపి | | | చాళుక్య వేంగీ " [ 1 పశ్చిమచాళుక్య తూర్చుచాళుక్య పాతజావాకలి | | | పరిణామదశ-సంధికాలం కొత్తజావా | హళగన్నడలిపి పాతతెలుగులిపి
కన్నడలిపి తెలుగులిపి