Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/361

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

346

తెలుగు భాషా చరిత్ర

నుంచి అంతరించిపోయింది. విష్ణుకుండినుల శాసనాలలోని అక్షరాల అడ్డుగీత క్రమంగా పొడవై, వంకరై నేటి తలకట్టుగా స్థిరపడింది.

12.6. విష్ణుకుండినుల తర్వాత తెలుగుదేశాన్ని క్రీ శ. ఏడవ శతాబ్ధంలో చాళుక్యులు అక్రమించుకొన్నారు. వీరు దేశభాషాభిమానులు. వీరి కాలంలో తెలుగు భాషకు ఆదరం లభించింది; శాసనాలు తెలుగుభాషలో వెలువడినాయి. ఈ చాళుక్య రాజులు వేయించిన శాసనాలలో ప్రాచీనతమమయినది కుబ్జవిష్ణువర్థనునిది. దీని కాలం క్రీ. శ. 622. ఈ కాలపులిపిని వేంగీ చాళుక్యలిపి అని వ్యవహరించారు.

ఈ వేంగీచాళుక్యలిపిని మనం తెలుగు-కన్నడలిపి అని అనవచ్చు. ఇదిచాలా వ్యాప్తి చెందింది. బాదామీ చాళుక్యులను కూలదోసిన రాష్ట్రకూటులుకూడ ఈలిపినే వాడారు. ఈ లిపి మార్పులు చెందుతూ 10 వ శతాబ్దీకి సంపూర్ణంగా వికసించి ఆధునిక తెలుగు-కన్నడ లిపిగా పరిణమించింది.

12.7. చాళుక్యులు వేంగీదేశాన్ని అక్రమించుకొన్న కాలంలోనే, పశ్చిమాంధ్ర ప్రాంతాన్ని తెలుగుచోళులు పాలించేవారు. వీరు మొదట పల్లవుల సామంతులైనా, తర్వాత స్వతంత్రులయ్యారు. వీరు తమ శాసనాలు వేంగీచాళుక్యలిపిలో వేయించారు. వీరిలో, రేనాటి చోళరాజయిన ఎరికల్‌ముత్త రాజు శాసనమొకటి కడపజిల్లా కమలాపురం తాలూకా ఎర్రగుడిపాడు గ్రామంలో చెన్న కేశవస్వామి దేవాలయం పక్క రాతిపై చెక్కబడి ఉంది. దీనికాలం క్రీ. శ. 575. ప్రస్తుతం మనకు లభించిన మొట్టమొదటి తెలుగుశాసనం ఇదే. (M. Venkata Rangayya, History of Telegu Chodas; తిరుమల రామచంద్ర, మనలిపి పుట్టుపూర్వోత్తరాలు 1957) సత్యాశ్రయుడనే రేనాటి చోడరాజు శాసనమొకటి కడపజిల్లా పొట్లదుర్తి-మాలెపాడు గ్రామంలో ఉంది. ఇది మనకు దొరికిన ప్రాచీన శాసనాలలో రెండవది.

ఈవేంగీ చాళుక్యలిపికి క్రీ.శ. 10, 11, 12 శతాబ్దాలనుంచి పరివర్తనకాలం, దీనిని బర్నెల్‌ సంధికాలం అన్నాడు. ఈ మార్పు 14వ శతాబ్ధంనుంచి మరింతస్పష్టమయింది. ఇదే ఇప్పటి తెలుగు కన్నడలిపుల ప్రాచీనరూపం.

నన్నయ ఈ వేంగీ-చాళుక్యలిపిలోనే తన భారతం వ్రాసి ఉంటారు. అతని భారత ప్రతులు మనకు లభించకపోయినా, ఆయన రచించిన నందంపూడి శాసనం లభించింది. ఆ కాలపు మరికొన్ని శాసనాలు దొరికాయి. వానినిబట్టి అప్పటిలిపి