తెలుగులిపి పరిణామం
349
“పూర్ణేందు సధృశః పూర్ణః అర్థస్త్వర్ధేందు సన్నిభః” అని పూర్జార్థ బిందువులను సూత్రీకరించినా, దాని సమకాలపు శాసనాలలోగాని, అంతకుముందున్న శాసనాలలో గాని అరసున్న కనిపించదు. అప్పటివారు పదమధ్యానునాసికాలను అవసరమైతే ఊది పలకడం, అవసరంకాకపొతే తేల్చి పలకడం అలవాటు; వ్రాయడం మాత్రం అనునాసిక మధ్యమైన దానిని ద్విత్వాక్షరంగానే వ్రాసేవారు-'నేణ్టి', 'కూస్తూఱు' లాగా (SII 4.286). అనునాసికాలకు అనుస్వారం వ్రాయడం ప్రాకృతభాషా ప్రభావాన్ని బట్టి అలవాటయిన తర్వాత అనునాసికయుత సంస్కృతపదోచ్చారణలో చిక్కు కలుగలేదు గాని, తెలుగు పదాల ఉచ్చారణలో చిక్కు వచ్చింది; ఏది తేల్చిపలకాలో, ఏది ఊది పలకాలోనని, దానికొకపద్ధతి అనుసరించినట్లు శాసనాలలో కనిపిస్తుంది : 'రాముండ్డు' అనే దానిని ఒత్తిపలకాలి; 'రాముండు' అనే దానిని తేల్చి పలకాలి. దీర్ఘం మీది 'నేంటి', 'మూండు' వంటి పదాలలోని అనునాసికాన్ని తేల్చిపలకసాగారు; ఏ కారణంగానో. కాని, వీటినిగూడ ఒత్తిపలుకడం లేకపోలేదు-మూండ్డు, కూంత్తురు లాగ (SII 4.476). ఇది నేడు తమిళనాడులో పూర్వం స్థిరపడిన తెలుగువారి ఉచ్చారణలో నేటికీ మిగిలింది-వేండ, వాండు ఇత్యాది. అనునాసికాలకు అనుస్వారం అలవాటయిన తర్వాత కొన్ని మాటలను తేల్చి పలకడంకోసం ఖండ బిందువును వైయాకరణులు తర్వాత సృష్టించారు. ఇది ఒకప్పుడు వ్యవహారంలోఉండి, కాలక్రమాన లోపించిన ఉచ్చారణల జ్ఞాపకచిహ్నంగా కొందరి వాడుకలోఉండి, తర్వాత వైయాకరణుల దృష్టికి వచ్చి ఉంటుందని భావించవచ్చు.
12.12. ముఖ్యాక్షరాలు ఎంతమారుతూవచ్చాయో గుణి౦తాలు అంతకు రెండింతలు మారాయి. ద్విత్వాక్షరాలను సూచించే ఒత్తులు చాలావరకు పూర్వస్వరూపంలోనే ఉన్నాయి.
12.13. తలకట్టు అవరం మారుతూవచ్చినప్పుడు ఏర్పడిన అకారమే గాని విడిగాచేరిందికాదని ఇదివరకే తెలుసుకొన్నాము. కాని, తలకట్టు అకారానికి చిహ్నమనేభావం తర్వాత స్థిరపడింది.
12.14. ఆకారం, అకారం దీర్ఘం సూచించడానికి చిన్న అడ్డుగీత పెట్టడం అశోకభట్టిప్రోలు శాసన కాలంనుంచి ఉంది. ఈ అడ్జుగీత అక్షరం కుడి పైచివర