పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/357

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

342

తెలుగు భాషా చరిత్ర

మొ. (d) గృహపరికరాలు : బాల్చీ, పీపా, మేజా, సబ్బు, మొ. (e) ఇతరాలు : బిస్కతు, బాతు మొదలైనవి.

11.15. పోర్చుగీసుల తర్వాత భారతదేశానికివచ్చి సుస్థిర ప్రభుత్వాన్ని నెలకొల్పి ఇక్కడ భాషలపై ప్రభావం చూపిన యూరోపియనులు ఆంగ్లేయులు. ఈస్టిండియా కంపెనీవారు క్రీ. శ. 1600లో ఎలిజబెత్తురాణినుంచి భారతదేశంలో వ్యాహారంచేయటానికి అనుమతి సంపాదించి వచ్చి 18వ శతాబ్దినాటికి తమ అధికారాన్ని ఇక్కడ నెలకొల్పారు. ఆంగ్లేయలు వైజ్ఞానికసాంస్కృతిక సాంఘిక రంగాలలో అనేకమైన మార్పులు తెచ్చారు. దాని వలితంగా ఇంగ్లీషుపదాలనేకం తెలుగులో ప్రవేశించాయి. నిత్యావసరాలకు సంబంధించిన లైటు, స్విచ్చి, కాఫీ, రోడ్డు, బస్సు, కారు, పెన్ను మొదలైనవి; పరిపాలనా స౦బంధమైన కోర్టు, ఆఫీసు, ఆర్డరు, ఫైలు మొదలైనవి ; సాంస్కృతిక సంబంధమైన ఫ్యాషను, డాన్సు, సినిమా, ఫ్యాను, రేడియో, క్లబ్బు మొ. పదాలు తెలుగులోకి వచ్చాయి.

11.16. ఇంగ్లీషు పదాలు తెలుగులోకి వచ్చేప్పుడు పద స్వరూపాలలో, ధ్వనులలో కొన్ని మార్పులు కనిపిస్తాయి.

i. తెలుగు స్వరాంతభాషకావడంవల్ల వ్యజనాంతాలైన ఇంగ్లీషు పదాలపైన అచ్చుచేరి, చివరివ్యంజనం స్పర్శం అయితే ద్విరుక్తమవుతుంది. ఉదా : రోడ్‌ > రోడ్డు ;

స్పర్శేతర వ్యంజనం పదాంతలో అంటే అది హ్రస్వాచ్చూర్వకమైతేనే ద్విరుక్తమవుతుంది. ఉదా: పెన్‌ >పెన్ను; బస్ > బస్‌; ఫ్యాన్‌ > ఫ్యాను; రైల్‌ > రైలు.

ii. అవిద్యావంతులభావలో పదాది సంయుక్తాక్షరాలు స్వరభక్తితో విడివడి ఉచ్చారణలో కనిపిస్తాయి. ఉదా: క్లాసు > కిలాసు; గ్లాసు > గిలాసు.

iii. పదమధ్యంలోకూడా స్వరభక్తి కనిపిస్తుంది. ఉదా : డాక్టర్‌ > డాకటరు; కలక్టర్ > కలకటరు.

iv. స్వరభక్తి సాధ్యంకానిచోట సంయక్తాక్షరంలోని మొదటివర్ణం లోపిస్తుంది. ఉదా : స్టేషన్‌ > టేషన్‌.

v. స్థ అనే సంయుక్త వర్ణం ష్ట గా మారుతుంది. ఉదా : ఫష్టు > పష్టు.

vi. దంత్యోష్టశ్వాసోమ్మం [ఫ] తెలుగులో [ప] గా మారుతుంది, ఉదా : కాఫీ > కాపీ; ఫష్టు > పష్టు.