తెలుగులో అన్యదేశ్యాలు
341
తెలుగులో యూరోపియన్ భాషాపదాలు
11. 12. తెలుగుపై ప్రభావంచూపిన యూరోపియన్‌భాషలలో పోర్చుగీసు మొదటిది. 1498లో పోర్చుగీసులు భారతదేశపు పశ్చిమతీరంలోకి ప్రవేశించడంతో పోర్చుగీసు తెలుగుభాషలకు సంబంధాలేర్పడ్డాయి. పోర్చుగీసులకిి, విజయనగరరాజులకి వాణిజ్య సంబంధాలుండేవి. విజయనగరసామ్రాజ్యంలోని శాంతో౦, మైలాపూరం, నాగపట్టణం మొదలైనచోట్ల పోర్చుగీసులకి స్థావరాలుండేవి. 16వ శతాబ్దిలో పోర్చుగీసులు దక్షిణభారతరాజకీయాలలో జోక్యంచేసుకోవటంవల్ల, వాళ్ళతో రాజకీయ సంబంధం ఉంచుకోవడంకోనం పరిసర ప్రాంతాల రాజకీయోద్యోగులు పోర్చుగీసుభాషను నేర్చుకొవలసి వచ్చింది. 1571లో పొర్తుగాలు చక్రవర్తి ఆజ్ఞాపత్రాన్ననుసరించి చాలామంది భారతీయ క్రైస్తవులను దుబాసీలుగా నియమించడం జరిగింది. అందువల్ల దేశీయులు చాలామంది పోర్చుగీసు భాషను నేర్చుకోవడం ప్రారంభించారు. అంతేగాక చెన్నపట్టంలో ఇంగ్లీషు కుంఫిణి దొరలు వచ్చిన కొత్తలో వారు స్థాపించిన న్యాయస్థానాలలో పోర్చుగీసుభాషనే వాడే వారు. దానపత్రాలు, భూమీక్రయపత్రాలు, మొ. వి. పోర్చుగీసు తెలుగుభాషల్లోనే ఉండేవి.
11.13. పోర్చుగీసువారు తమతోటి మనదేశానికి కొన్ని పళ్ళని, కాయలని తీసుకొనిరావటం వాటిని సూచించేపదాలుకూడా తెలుగులోచేరాయి. అనాస, గొయ్యా (జామ), గోబీ (క్యాబేజి), బొప్పాయి, టమాటో ఇలా వచ్చిన పదాలే, (తూమాటిదొణప్ప, 1962), తెలుగులో తాళపుచేవిలో-చెవి 'ళావి' అనే పదంనుంచి వచ్చిన రూపం. వస్త్రసంబధమైన కమీజు, బొత్తాం; వస్తుసంబంధమైన అల్మార, బాల్చీ, మేస్త్రి మొదలై న పదాలు పోర్చుగీసు భాషనుంచి తెలుగులోచేరినవే. 'ఇస్త్రీ' అనేదికూడా పోర్చుగీసుమాటే.
11.14. 'క్రిస్తాను' అనే పోర్చుగీసుమాట స్వరభక్తితో 'కిరస్తాను' అయింది. పోర్చుగీసు 'తోవాల్య' అనే పదంనుంచి చివరి 'య' లోపించి 'తువ్వాల, తువ్వాలు" అనే పదాలు ఏర్పడ్డాయి. పోర్చుగీసుభాషనుంచి తెలుగులోకివచ్చిన ఇతర పదాలు కొన్ని : (a) సైనిక సంబంధాలు : కపితాను, కమాను, పటాలము, సార్జంతు, మొ. (b) వస్త్రసంబంధాలు, మే (జోడు), ఇస్త్రీ, కమీజు, కాజా, బొత్తము, మొ. (c) వర్తకసంబంధాలు : కుంపిణి, కోస్తా, గిడ్డ౦గి, గోదాము, బంకు,