Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/353

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

338

తెలుగు భాషా చరిత్ర

      ఉర్దూ                 తెలుగు                  అర్ధం
     జమానా               జమచేయు              'కూడబెట్టడం' 
     హర్రాజ్‌              హర్రాజు               'వేలంపాట' (తెలం. మాండలికం)

ఝ > జ

     ఝాడు                జాడు                 'చీపురుకట్ట' 
     ఝగ్ డా               జగడం               'పోట్లాట'    

గ > గ

     గష్త్                   గస్తీ                   'గస్తీ' (watch) 
     గుత్త                  గుత్తా                  'గుత్త' (contract) 
     జగహ్                 జగా                   'స్థలం'
     హంగామా              హంగామా              'కల్లోలం'

ఘ > గ

     ఘాబ్రా                గాభరా/గాబరా           'భయం'

ఫ > స

     ఫుర్ సత్             పురసతు                'తీరిక'
     తారఫీ               తారీపు                  'మెచ్చుకోలు'
     లిఫాఫ               లిపాప                  'కవరు'

స > స

     సపార్               సవారీ                  'వాహనం'     
     సౌదా                సవుదా(చవుదాలు)       'వస్తువులు'
     సిపాహి              సిపాయి                 'సైనికుడు'
     హిస్సాబ్             హిసాబు                 'లెక్క'   
     పసంద్              పసందు                 'ఇష్టం'

ష > ష

     షికార్‌               షికారు                 'వాహ్యాళి'  
     తమాషా              తమాషా                'వేడుక'
     షర్త్‌                షరతు                  'ఒడంబడిక'