పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/345

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

330

తెలుగు భాషా చరిత్ర

11.3. 15వ శతాబ్ది ఉత్తరభాగంనుంచి శాసనాల్లో పరిపాలనా వ్యవస్థకు సంబంధించినవి, సామాన్య ప్రజలు ఉపయోగించేవి, సైనిక వ్యవస్థలో ఉపయోగించేవి, న్యాయశాస్త్రానికి సంబంధించినవి సుమారు 200 పదాలు పర్షీయన్‌, అరబిక్‌ భాషలకు సంబంధించినవి కనబడ్డాయి. (మోడేకుర్తి సత్యనారాయణ, భారతి, అక్టోబర్‌, 1959.) అయితే సహజ ధ్వని విపరిణామ పద్ధతులకి భిన్నంగా పదాలు కొన్ని శాసనాలలో కనిపిస్తున్నాయి. ఉదా: ప. ఖర్చ్‌, తె. కురుచ; ప.కాగజ్‌, తె. కాకితం మొ. కురుచలో అ > ఉ సహజధ్వని విపరిణామానికి విరుద్ధం. అజ్మధ్యస్థంగా నాదథ్వనులే సాధారణంగా కనిపించవలసి ఉండగా 'కాకితం'లో శ్వాసస్పర్శాలు కనిపిస్తున్నాయి. అంటే నాదోష్మమైన 'గజ'లు 'గ,జ/ద'లుగా మారవలసి ఉండగా ఆ స్థానంలో 'క,త'లు కనిపిస్తున్నాయి. ఈ పదం ఇలాగే కావ్యాల్లోకూడా కనిపిస్తుంది. బహుశా కవుల, శాసనలేఖకుల ప్రయోగాలలో అలాంటిరూపం ఉండి ఉంటుంది. 'మరహమ్మతు' అనే మాట మరమ్మతుకు సమానంగా బాగుచేయటం అనే అర్థంలో కనిపిస్తుంది. ఇలా పదంమధ్య హ కారంచేరే అవకాశాలేమీలేవు. పర్షియన్‌లో 'దయకలిగిఉండు' అనే అర్థంలో మరహ్ మత్‌/మర్హ మత్‌ అనే పదం కనిపిస్తుంది. బహుశా శాసన లేఖకులు రెండు పదాలను సమానార్థకాలుగా భావించి 'మరమ్మతు'కు మూలరూపం 'మరహ్ మత్‌' అని అనుకొని ఉంటారు.

11.4. ప్రాచీన కావ్యాలలో సుమారు 900 ల అన్యదేశ్యాలు ముఖ్యంగా పర్షియన్‌, అరబిక్‌, భాషలకు సంబంధించినవి కనిపిస్తాయి. రాజకీయ సంబంధమైన సుల్తాను, పాదుషా, ఫ్లర్మానా, హుజూరు, కితాబు మొ, వి., సైనిక పరమైన సిపాయీ, తుపాకీ, బందుకు, ఫిరాయించు, పౌజు, బందోబస్తు, మొ. వి., వ్యాపార సంబంధమైన దుకాణం, త్రాసు, మొ. వి., రెవిన్యూ పదాలైన కౌలు, కుళ్కీ, దుంబాలా మొ. వి., న్యాయశాఖకు సంబంధించిన దివాను, నకలు, నకాబత్తు మొ. వి., సామాన్యజనులు ఉవయోగించే వస్తుసామగ్రికి సంబంధించిన కుర్చీ, ఖాబు, మొ. వి., వస్త్రవిశేషాలైన కలంకారీ, జంబుఖానా, కుల్లాయ, జరతారు మొ. వి., ఆటలకు సంబంధించిన గంజిఫా మొ. వి., పైన పేర్కొన్న అన్య దేశ్యాలలో కనిపిస్తాయి (చక్రధరరావు ; 1965). వీటిలో చాలామాటలు కొన్ని దేశ్యాలను వాడకంలో లేకుండాచేశాయి. ఉదా : దుకాణం, కౌలు, సిపాలు, ఖూనీ మొ.వి.