Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/344

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తెలుగులో అన్యదేశ్యాలు

329

వల్ల ఎక్కున మార్చు చెందటానికి ఇదే కారణం. నిజాం పరిపాలనాకాలంనాటి జనాభాలెక్కల్ని పరిశీలిస్తే కొత్త వృత్తి కులాలు (occupational classes) కనిపిస్తాయి. కస్సాబులు లేక కటికవాళ్ళు, కలాలువాళ్ళు (సారా మొదలైన మత్తు పదార్థాలు తయారుచేసేవాళ్ళు కొత్త పరిిశ్రమలు స్థాపించారు. చిమ్‌టా, కటార్‌ మొదలై న పరికరాల్ని వాడటం జరిగేది. కొంతమంది పర్షియనులు తివాసీ పరిశ్రమ మొదలుపెట్టారు. బట్టలమీద అద్ధకంకూడా మహమ్మదీయులు మొదలుపెట్టిన పరిశ్రమే. మొదటినుంచి నవాబులు ఆడంబరంగా ఉండేవాళ్ళు కనక జరీవస్త్రాలనేత, కలంకారీ అద్దకాలకి ఎక్కువ ప్రోత్సాహం లభించి విదేశాలలోకూడ ప్రఖ్యాతి పొందాయి. ఈ విధంగా ప్రజల సాంస్కృతిక జీవనం కొంతమారింది. ఇంకా రెండు సంస్కృతుల సంసర్గం ఫలితంగా కొత్తమాటలు తెలుగులోకి వచ్చాయి. అప్పటి అధికారభాష పర్షియన్‌ అయి ఉండటంతో పర్షియన్‌, అరబిక్‌, ఉర్జూలను నేర్చుకొన్నవారికి ఉన్నతోద్యోగాలు, విదేశాలకు పోవటానికి అవకాశ౦ ఇచ్చేవారు. ఇంగ్లీషువాళ్ళుకూడ 1885 వ సంకలో ఉర్జూను రాజబాషగా ప్రకటించారు. ఇట్లా అన్నివిధాల పై స్థాయిలో ఉండి పర్షియన్‌, అరబిక్‌, ఉర్దూ భాషలు తెలుగుపై ప్రభావం చూపాయి.

11.2. పర్షియన్‌, అరబిక్‌ భాషలనుంచి తెలుగులో ప్రవేశించిన పదాలలో కొన్ని చాలా సహజ ధ్వనిపరిణామ పద్ధతులకు భిన్నంగా మార్పులు పొందినట్లు కనిపిస్తుంది. ఉదా :

     తెలుగు                 పర్షియన్‌                  అర్థం
    ఎకిమీడు                 హకీమ్‌                  'యజమాని'
    హస్తిభారము              ఉస్తువార్‌                 'పునాది'
    సిరినామా                నర్‌నామా                 'చిరునామా'

పై మాటల్నిచూస్తే సాధారణంగా తెలుగులో జరిగే ధ్వని పరిణామాలకు భిన్నమైన పరిణామాలు కనిపిస్తాయి. తెలుగులో సాధారణంగా పదాది హకార లోపం కనిపిస్తుంది. ఉదా : ఉషారు (<హుషార్‌) కాన దానిపైన అచ్చులో మార్పురాదు. కాని ఎకిమీడు (<హకిమ్‌), లో 'ఆ' 'ఎ' కావడం కనిపిస్తుంది. అలాగే. తక్కిన ఉదాహరణలుకూడా సాధారణజనంలో ఉన్న పద్ధతిలోకాక ఛందస్సుకోసమో, రచనానుకూలంగానో మార్పులుచేసి కవులు కావ్యాలలో ప్రయోగించి ఉంటారు.