పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/346

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తెలుగులో అన్యదేశ్యాలు

331

11. 5. ఒక భాష వేరొక భాషనుంచి పదాల్ని ఎరువు తెచ్చుకున్నప్పుడు స్వభాపావర్ణ నిర్మాణానికి అనుకూలమైన పద్ధతిలో పదాలను మార్చుకుని తనలో ఇముడ్చుకుంటుంది. పర్షియన్‌ 'సుల్తాను' పదానికి రూపాంతరాలైన సురతాణ, సురతాణిి, సురత్రాణ, సురథాణి, సురథాణు, సురదాణి, సురధాణి, సురధాణ, సురధానిలాంటి కావ్య ప్రయోగాలకు సరియైన వివరణలు ఇవ్వటం కష్టమే అయినా తెలుగులో లేని ధ్వనులుగల అన్యదేశ్యాలలోని ధ్వనులు ఎలా౦టిమార్పులు చెందాయో సంగ్రహంగా ఇక్కడ వివరిస్తాను.

1. తెలుగులో దంత్యస్పర్మోష్మాని (చే) కి సమానమైనధ్వని ఉర్దూలోలేదు. కాబట్టి తాలవ్యేతర స్వరం పరమైనా ఉర్జూనుంచి అరువు తెచ్చుకున్న పదాలలో తాలవ్య స్పర్శోష్మమే కనిపిస్తుంది.

ఉదా : చాక్‌, చార్‌,

2. ఉర్దూలో ఉన్న (z) కు పరంగా తాలవ్యాచ్చు వచ్చినప్పుడు దాన్ని తెలుగులో జ గానే ఉచ్చరిస్తాం. ఉదా : ఆ జిలా,తె. జిల్లా; అ.జిద్‌, త. జిద్దు.

3. ఉర్జూ (z) కు పరంగా తాలవ్యేతరస్వరంవస్తే తెలుగులోదాన్ని ౙ(dz)గా ఉచ్చరిస్తాం. ఉదా : వ. జమీందార్‌, తే ౙమీందారు; ప. జమానా, తె.ౙమానా; ప. జరీ, తె. ౙర్సీ; ప. జప్త్‌, తె. ౙఫ్తు.

4. తాలవ్యేతర స్వరం పరమైన అన్యదేశ్యాలలోని [J] ను [ౙ] గా కూడా ఉచ్చరిస్తాం. ఉదా: ఉ. జోడ్‌, తె. జోడు; ప. జాగీర్జార్‌, తె. ౙగీర్దారు/ జే గీర్జారు.

5. సమీపమాతృకలోని పరహనుమూలీయ స్పర్శవర్థం క (q) తెలుగులో [ఖ] వర్ణంగా మారుతుంది. ఉదా : ఉ. క్షరార్‌, తె. ఖరారు “ఒడంబడిక”; ఉ. కస్సాబ్, తె. ఖసాబు 'ఒక వృత్తికులం'; ఉ. కాబు, తె. ఖాబు 'పెద్దపాత్ర.'

మెకంజీ రాత ప్రతుల్లో పై పదాలకు రూపాంతరాలు కనబడ్డాయి. ఉదా : కరారు, కసాబు మొ. నేటి తెలుగులో 'భాబు' అనే మాటకు బదులు 'గాబు' అనే మాట వాడకంలో ఉంది.

6. [క] [క]గా మాత్రమే మార్పుచెందటంకూడా కనిపిస్తుంది. ఉదా: ఉ. కబ్జా తె. కబా.