Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/342

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

స్తున్నది. ఎందుకంటే తిక్కన సోమయాజి భారతభాగంలో త్రాసు (<తరాజూ) అనే పదాన్ని రెండుసార్లు వాడాడు. (చక్రధరరావు 1965: 8). అంటే ఈ పదం అయన కాలంనాటికే బాగా వాడుకలో ఉండి ఉండాలి. ముసల్మాను పాదుషాలలో అల్లావుద్దీన్ ఖిల్జీ సైన్యం మొట్టమొదట దక్షిణానికి వచ్చి ఓరుగల్లుని ముట్టడించింది (1234). అల్లావుద్దీన్ సైనికులలో కొందరు తిరిగి ఢిల్లీ వెళ్ళక దక్షిణంలోనే స్థిరపడిపోయారు. ఆ సంఘటనే ఆంధ్రుల, ముసల్మానుల కలయికకి నాంది అయింది. తరువాత ఢిల్లీ సుల్తానయిన ఘయాసుద్దీన్ తుగ్లకు కాలంలో కాకతీయులు ఢిల్లీ సుల్తాన్లకి సామంతులయ్యారు. మహమ్మద్ బిన్ తుగ్లక్ తన రాజధానిని ఢిల్లీనించి దేవగిరికి మార్చటంతో మరికొంతమంది ముస్లిముల రాకకు కారణమయింది. ముసల్మానుల దాడిని ఆపటంకోసం, ఆంధ్రసంస్కృతిని కాపాడటానికి 1336 లో విజయనగర సామ్రాజ్యం స్థాపించబడింది. అదే కాలంలో 1347లో హసన్ గంగూ బహమనీ రాజ్యాన్ని స్థాపించాడు విజయనగరరాజులకి బహమనీరాజులకి యుద్ధాలు తరచూ జరుగుతుండేవి. విజయనగరరాజులు గుర్రాలని అరబ్బులవద్ద, పారశీకులవద్ద కొంటూండేవారు. తుపాకివాడకం కూడా తురకల వద్దనే నేర్చుకొన్నారు. మహమ్మదీయ సైనికులు మంచి శిక్షణ కలవారని తమ సైన్యంలో చేర్చుకొంటూండేవారు. వారి సైనికులు హైందువులతో కలియటంవల్ల కొన్ని కొత్తమాటలు సైనిక వ్యవస్థలోకి రావటం జరిగింది. మహమ్మదీయ సైనికులు దక్షిణవాసులతో మాట్లాడటానికి తమతోతెచ్చిన మిశ్రమ భాషనీ ఉపయోగించేవారు. వారు మాట్లాడే భాషలో పంజాబీ, హర్యాని, ఖడీబోలీపదాలూ, అరబిక్, పర్షియన్ పదాలూ ఉండేవి. ఈ భాషే రానురాను సాహిత్యభాషగా మార్పుచెందింది. సాహిత్యవేత్తలు దీన్నే 'హింద్వీ' అని, 'దక్ఖనీ' అని పిలిచేవారు. ఇది 18వ శతాబ్దంవరకు రాజభాష కాలేకపోయినప్పటికీ, స్థానిక ప్రజలు విరివిగా వాడటంవల్ల తెలుగుపై ప్రభావం చూపింది.
తెలుగుభాషా పరివర్తనకి ఒక సైనికోద్యోగలే కారకులుకారు. దక్షిణభారతం లోని అప్పటి రాజకీయ పరిస్థితులు కూడా కారణమయ్యాయి. అప్పుడు వేరువేరు ప్రాంతాల్ని పాలించే హిందూరాజులలో ఐక్యంలేదు రాచకొండవెలమలు, కొండవీటిరెడ్లు దేవరాయలకి శత్రువులయ్యారు. వీరు బహమనీ రాజులతో కలిసి విజయనగరంతో యుద్ధం చేసేవారు. ఆ మహమ్మదీయ పాలకులతో మంచి సంబంధంకలిగి ఉండటానికి కనీసం కొందరు ముఖ్యోద్యోగులైనా వారి రాజభాష అయినా పర్షి