పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/343

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

యన్‌ని నేర్చుకోవలసివచ్చింది. వీరభద్రారెడ్డిమంత్రి అయిన బెండవూడి అన్నయామాత్యుడు (క్రీ. శ. 1420) పర్షియన్‌, అరబిక్‌, టర్కిష్‌ భాషలను నేర్చుకొన్నాడని శ్రీనాథుడు భీముఖండంలో చెప్పాడు. క్రీ. శ. 1530 లో బహమనీరాజ్యం చీలిన తరువాత గోలకొండను కుతుబ్‌షాహీలు పాలించారు. సుల్తాను కులీకుతుబ్‌షా ఆంధ్రప్రాంతమంతా ఒకేరాజు అధికారంలో ఉండటం అవసరమని అనుకొని విజయనగర రాజులతో యుద్ధంచేసి కొండవీడు, బెల్లంకొండల్ని వశపరచుకొన్నాడు. క్రీ. శ. 1565లో ఇంబ్రహీం కుతుబ్‌షా కాలంలో జరిగిన తల్లికోట యుద్ధంలో రెండు శతాబ్దాలపాటు ఆంధ్ర సంస్కృతిని కాపాడుతూ వచ్చినటువంటి విజయనగర సామ్రాజ్యం నాశనమయింధి. మహ్మాదు కులీకుతుబ్‌షా కాలంనాటికి(క్రీ. శ. 1580) వారి రాజ్యానికి ఉత్తరాన గోదావరి, దక్షిణాన తుంగభద్రానది సరిహద్దులుగా ఉండేవి. అంటే ఆంధ్ర భూభాగంలో చాలాభాగం మహమ్మదీయుల పాలనలోకి వచ్చిందన్నమాట. వీరికాలంలో తెలుగువాళ్ళ సంస్కృతి కొత్తపంథాలో నడిచిందని చెప్పొచ్చు. ఆంధ్రదేశంలో ఆంతకుముందున్నటువంటి పరిపాలనా వ్యవస్థని కొంతవరకు మార్చారు. అప్పటి రాజభాష పర్షియన్‌. అందుకని పరిపాలనావ్యవస్థ లోని కొన్ని మాటలు పర్షియన్‌నుంచి తీసికొనబడ్డాయి. ఉదా: దీవాను, కొత్వాలు మొ॥వి. చాలామంది తెలుగువారు ఉన్నత పదవుల్లో ఉండటంతో పరిపాలనా సౌలభ్యంకోసం తమ మాతృభాష అయిన తెలుగునేకాక అరబిక్‌, పర్షియన్‌లను కూడ నేర్చుకుంటూండేవారు. వారేకాక సామాన్య ప్రజలు కూడ కొన్నికొన్ని మైన పర్షియన్‌, ఉర్దూ మాటల్ని వాడే అవసరం ఉండేది.

ఒక పరిపాలనా విషయంలోనేకాక వ్యాపార, వాణిజ్యరంగాలలో కూడ పర్షియనులు, మహమ్మదీయులు ఆధిక్యత కలిగి ఉండేవారు. ఆ పరిస్థితులలో వాణిజ్య సంబంధమయిన మాటలుకూడ తెలుగుభాషలోకి వచ్చాయి. ఉదా : గసగసాలు, ఖరీదు, కిస్ మిస్ మొ॥వి. క్రీ. శ. 1687 లో ఔరంగజేబు గోలకొండను పూర్తిగా వశం చేసుకొన్నాడు. క్రీ. శ. 1707 లో ఔరంగజేబు మరణించిన తరువాత ఢిల్లీరాజ్యం బలహీనం అయిన సమయంలో క్రీ. శ. 1723 లో నిజాముల్‌ ముల్కు “ఆసఫ్‌జా" అనే బిరుదంతో స్వతంత్రరాజ్యాన్ని స్థాపించాడు. క్రీ. శ. 1766వ సం॥లో నిజాముకు ఆంగ్లేయులకి జరిగిన ఒడంబడిక ప్రకారం ఉత్తర సర్కారులు ఆంగ్లేయలు తీసుకొన్నప్పటికి తెలంగాణాప్రాంతం మాత్రం ముస్లింల అధికారం కింద ఉండేది. తెలంగాణాప్రాంతంలో మాట్లాడే తెలుగు, ఉర్దూ ప్రభావం