పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/341

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రకరణం 11

తెలుగులో అన్యదేశ్యాలు

డాక్టర్ వి. స్వరాజ్యలక్ష్మి

11.0. ఏ భాషలోనైనా పదాలు దేశ్యాలు (indigenous), అన్యదేశ్యాలు (Foreign) అని రెండు రకాలుగా ఉంటాయి. మూలభాషల నుంచి సంక్రమించినవి దేశ్యాలు; తదితరాలు అన్యదేశ్యాలు. భాషలో కొత్తపదాలు చేరడానికి ముఖ్యమైన కారణం ఆదానం (Borrowing). సాధారణంగా ఒక భాషను మాట్లాడే ప్రజలు భౌగోళికంగా సమీపవర్తి భాషలనుంచిగాని, సాంఘిక, రాజకీయ, మత, సాంస్కృతిక, వాణిజ్య సంబంధాల వాళ్ళ దూరవర్తి భాషలనుంచి గాని కొత్త పదజాలాన్ని గ్రహిస్తారు. ఒక భాషా వ్యవహర్త ఒక వస్తువునుగాని, ఒక భావాన్నిగాని సూచించడానికి తగిన పదం తన భాషలో లేనప్పుడు తనకు సన్నిహిత సంబంధాల వాళ్ళ భాషలు పదాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటాయి. ఇలాటి పాదాలను బట్టి భాషావ్యవహర్తల సంబంధస్వభావాన్ని ఊహించవచ్చు.
ద్రావిడభాషా కుటుంబానికి చెందిన తెలుగును చారిత్రకంగా పరిశీలిస్తే ప్రాచీన దశలో తత్సమాతద్భవ పదజాలం ఎక్కువగా చేరినట్టు చెప్పవచ్చు. మహమ్మదీయుల పరిపాలన కాలంలో అరబిక్, పర్షియన్ భాషాపదాలు తెలుగువారి రాజకీయ, సాంఘికరంగాలలో వ్యవహారంలోకి వచ్చాయి. ఆ తరువాత వరుసగా పోర్చుగీసు, ఇంగ్లీషు మొదలైన యూరోపియన్ భాషల ప్రభావం తెలుగుపైన ఎక్కువగా కనిపిస్తుంది. తెలుగులో తత్సమ, తద్భవేతర భాషాపదాలను గురించి ఈ ప్రకరణంలో వివరిస్తాను.
11.1. మహమ్మదీయులు 18వ శతాబ్దంలో ఆంధ్రదేశంపై దండయాత్రలు జరపకముందే ఆంధ్రులకి మహమ్మదీయులకి వాణిజ్య సంబంధం ఉన్నట్లు తెలు