ఈ పుటను అచ్చుదిద్దలేదు
322
తెలుగు భాషా చరిత్ర
(iii) హకారం ద్వితీయ వర్ణంగా ఏర్పడిన సంయుక్తతలోని ణ కారం తెలుగులో ద్విరుక్త న కారంగా పరిణమించింది.
కన్న(య్య) కణ్హ కృష్ణః- చిన్నె చిణ్హ- చిహ్న- పన్నము పణ్హ- ప్రశ్న- వెన్నుఁడు విణ్హు విష్ణుః సన్నము సణ్హ- శ్లక్ష్ణ-
(iv) ఈ పరిణామం ప్రవర్తితంకాని రూపాలు కొన్ని తెలుగులో నిలిచిపోయాయి.
ఖాణము ఖాణం ఖాదనమ్ గాణ గాణ-, గాయణ గాయన- దుగుణము(రెండు రెట్లుకలది) దుగుణం ద్విగుణమ్ రాణి రాణీ రాఙ్ఞీ వక్కణము వక్ఖాణం వ్యాఖ్యానమ్
(v) సమీప మాతృకలోకి అఞ్చధ్య (intervocalic) ణకారం తెలుగులో డకారంగా మారింది.(మూర్జన్యానునాసికం (retroflex nasal) అనునాసికతను కోల్పోయి తద్వర్గీయమగు నాదవత్స్పర్శం (retroflex voiced stop) గా మారిందని చెప్పొచ్చు.)
అగ్గడి అగ్గణీ ఆగ్రణీ గడన గణణా గణనా గామిడి గామిణీ గ్రామణీ చల్లడము చల్లణ-, చలనక చల్లణగ.
జల్లెడ చాలణీ చాలనీ
(22) సమీప మాతృకలోని జ కారం తెలుగులో ఆరుదుగా ద కారంగా మారింది.
(i) పదాది ధ్వని పరిణామానికి కొన్ని ఉదాహరణలు :
దంట (<జంట) జమల- యమల-