పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/331

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

316

తెలుగు భాషా చరిత్ర

   మేన-మేనఱికాదుల          మేహుణ-               మైధున
లోని పూర్వభాగం 
  రాటము                   రహట్ట                  అరఘట్ట
  సాని (కొన్ని గృహనామాల 
లోని ఉత్తరభాగం, ఉదా.        సాహణి                 సాదనీ 
అల్లాసాని, చలసాని, పెమ్మ
సాని, లకంసాని, మొ.)
  (17) సమీవ మాతృకలోని నాదవత్స్పర్శాలు (voiced stops) శ్వాసవత్స్పర్శాలవడం ప్రాచీన తద్భవాల లక్షణం.
   కంతి                        గన్ధి                 గ్రంధి 
   కసవు                       ఘాస                 ఘాస- 
   కోన (ఆలకాపరి, కోనారి)       గోణ                   గౌ
   తోరము (వ్రతసూత్రం)        దోరో                  దోరః
   పాలసుఁడు                 బాలిసో                బాలిశః  
 (18) సమీపమాతృకలోని  శ్వాసవత్స్పర్శాలు నాదవత్స్పర్శాలుగా మారడం అర్వాక్కాలిక లక్షణం.
   గుమ్మడి                   కుమ్హాండ             కూష్మాండమ్      
   గొంతి                      కొతీ                   కుంతీ
   జక్కన                    చక్కవాఈ              చక్రావాకీ
   జల్లెడ                     చాలణీ                చాలనీ
   దొండ                     తుండ                తుండ
   దౌన (అంబులపొది)        తూణ                  తూణ
   బచ్చెన                   పచ్చణ                ప్రచ్ఛన్న
   బంతి (వరుస)             పన్తి                   పంక్తి
 (19) మూలద్రావిడభాషలో లేని సకారం తెలుగు, కన్నడం భాషలలో నూతనరీతి (innovation) గా ఏర్పడింది. ప్రాచీన తద్భవాలలొ సకారం కనిపించదు. దాని స్థానంలో చకారం కనిపిస్తుంది.