Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/332

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తెలుగులోని వైకృతపదాలు

317

(a) సమీప మాతృకలోని పదాది సకారం తెలుగులో చకారంగా మారిన రూపాలు :
   చక్కిలము               సక్కుల(లీ)            శష్కుల, శష్కులీ
   చక్కెర                  సక్కరా                   శర్కరా
   చామన                 సామణ                   శ్యామల
   చిక్కము                 సిక్కి                     శిక్య
(b) ఆఞ్మధ్యంగా కూడా కింది రూపంలో చకారం కనిపిస్తుంది.
   పాచిక                   పాసగ                   పాశక
(c) అనునాసికానికిపరంగా కూడా ఈధ్వని పరిణామం ప్రవర్తితమయింది.
   అంచ                  హంసో                   హంసః
   అంచు                 అంసుయ-               అంసుక-
   కంచము               కంచం                   కాంస్యమ్‌
   కంచు                 కంసో                     కాంన్యః
(d) ద్విరుక్తతలో సైతం సకారం చకారంగా మారింది.
   నిచ్చెన                నిస్సేణి                  నిశ్రేణి
   బచ్చు                 వేస్సో                    వైశ్యః
(e) కాని, సకారప్రభావం ప్రగాఢంగా పడ్డ అర్వాచీనదశలో సకారద్విత్వఘటిత రూపాలట్లే నిలిపినందుకు కొన్ని ఉదాహరణాలు :
   దిస్స (మొల)             దిస్స                  దిశా
   దుస్ససేనుఁడు           దుస్సాసనో            దుశ్శాసనః
   లెస్స                    లేస్సా                లేశ్యా 
   విస్స (న్న)              విస్స-                 విశ్వ (నాథ)-
   సస్పెము                సస్సం                 సస్య
(f) సకారాదులు చకారాదులుగా మారి నాదతను పొందిన రూపాలు కొన్ని కనిపిస్తున్నాయి. వీటి చకారాది రూపాలు గ్రంథస్థం కాలేదు.
   జట్టి (అమ్మకం)          నట్ట                    సార్ధ-
   జన (ను) ము           సణ                    శణ