పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/319

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

304

తెలుగు భాషా చరిత్ర

భాష స్వీకరించింది దాదాపు శూన్యమనే చెప్పాలి (Sapir : 192). అలాగే సంస్కృతభాష ద్రావిడ భాషలపై ప్రదర్శించిన ప్రభావం అనన్యమయింది. సంస్కృతాది హింద్వార్య (Indo-Aryan) భాషలనించి ద్రావిడ భాషలలోనికి ప్రవేశించిన అపారమైన పదజాలంతో పోల్చి చూస్తే, ద్రావిడ కుటుంబభాషలనించి హింద్వార్య భాషలలోకి వెళ్ళిన పదజాలం అత్యల్పమని అంగీకరించక తప్పదు (Kittel. Kannada-Eng. Dictionary, Preface; T. Burrow, Sanskrit Language, 1955 : 387,388). భారతీయభాషలలో శాస్త్రగ్రంథాలు తయారవుతున్న ఈ ఆధునికయుగంలో సైతం మన రచయితలు, అనువాదకులు, పరిశోధకులు, పరిభాషా కల్పనకి 'అన్యథా శరణం నాస్తి' అని సంస్కృతాన్ని ఆశ్రయించక తప్పడంలేదు. ఈ విధంగానే మధ్యయుగాలనాటి ఫ్రెంచిభాష ఆ౦గ్లాది భాషలపై చూపిన ప్రభావంకూడా పరిగణించదగ్గదేగాని, ఫ్రెంచిభాషపై ఆంగ్లప్రభావం అస్తి నాస్తి విచికిత్స (Sapir : 193). ప్రాచీనాంగ్లభాష మత సంబంధి పదజాలాన్ని ఎక్కువగా లాటిన్‌ భాషనించి ఎరవు తెచ్చుకున్నది. అట్లే పాలీ సంస్కృత భాషల వాసనలేని బర్మీ సయామీ భాషలలోని రచనా వ్యాసంగం: దురూహం (Sapir :194).

అయితే కొన్ని భాషలు అన్ని విధాల తమకంటే అత్యున్నతమైన భాషలతో సంసర్గం కలిగి ఉన్నప్పటికీ పదాలను ఎరవు తెచ్చుకోవడంలో ఎంతో వైముఖ్యాన్ని ప్రదర్శించినట్టుకూడా గమనించవచ్చు. ఉదహరణకి టిబెటిన్‌, కంబోడియన్‌ భాషలను సంస్కృతభాషా సాహచర్యం చాలా అధికం. కంబోడియన్‌ భాషలో వేలకొలది సంస్కృతపదాలు చోటు చేసుకున్నవి. టిబెటన్‌ భాషలోని ప్రాచీనసాహిత్యం భారతీయ సాహిత్యానికి, ముఖ్యంగా బౌద్ధమత ధార్మిక గ్రంథ సంచయానికి అనువాదప్రాయమయినప్పటికీ టిబెటన్‌ భాషలో నంస్కృతపదాలు గాని పాలీ ప్రాకృతపదాలుగాని అత్యల్పంగా వాడుక చేయబడ్డాయి. సంస్కృత పాలీ ప్రాకృతపదాలన్నీ టిబెటన్‌ భాషలోని దేశ్యపదాలలోనికి అనువదించే ఒక నిర్దిష్ట కఠోర వైఖరి దీనికి హేతువుగా నిరూపించబడ్డది (Sapir, 1921: 196&197; Weinreich 1953: 61). ఈ వైముఖ్యానికిమరికొన్ని ఉదాహరణలనుకూడ చూడవచ్చు. మధ్యయుగాలలో ఇంగ్లీషు, జర్మన్‌ భాషలు మాతృభాషలుగా వ్యవహారంలో ఉన్న దేశాలమీద ఫ్రెంచి, లాటిన్‌ భాషల ప్రభావం దాదాపు తుల్యంగానే ఉన్నప్పటికీ ఈ భాషనించి ఇంగ్లీషుభాష స్వీకరించిన పదజాలంలో పదోవంతు